iDreamPost
android-app
ios-app

వచ్చే AP ఎన్నికల్లో మరోసారి జగన్ సునామీ! తేల్చిన సర్వే

YS Jagan: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా మరో సర్వే సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మళ్లీ జగనే సీఎం అని తేలింది

YS Jagan: ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. తాజాగా మరో సర్వే సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో మళ్లీ జగనే సీఎం అని తేలింది

వచ్చే AP ఎన్నికల్లో మరోసారి జగన్ సునామీ! తేల్చిన సర్వే

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తోన్నారు. ‘సిద్ధం’ పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ,జనసేనా, బీజేపీతో కలిసి ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయనున్నాయి. ఇరుపార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో ఏపీలో ఏ పార్టీ  అధికారంలోకి వస్తుందా అనే ఆసక్తి  అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది.

రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒక్కటి ఒకవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది.  వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనతో బీజేపీ జత కట్టిన తరువాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎంత శాతం ఓట్లు రాబడుతుంది.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని అందరిలో ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు సర్వేలు కూడా తమ అంచనాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు దాదాపు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మొగ్గు చూపాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ  పొలిటికల్  క్రిటిక్స్ అనే  సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

2024 ఏపీ శాసన సభ ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పరాభవం తప్పదనే ఆ సర్వే అంచాన వేసింది. ఇక పొలిటికల్ క్రిటిక్స్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ సీపీకి 121 +/- 5 స్థానాల్లో విజయం సాధిస్తుంది. అలానే 49.5 శాతం ఓట్లను సాధిస్తుంది. ఇక  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 54+/-5 స్థానాలు గెల్చుకుంటుంది. అదే విధంగా ఓటింగ్ శాతం 43 వస్తుంది. ఇక జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్, ఇతరులకు ఒక్కస్థానం కూడా లభించదని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కి 2.5 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

CM jagan again in AP

సీఎం జగన్ పరిపాలనపై ఎక్కువ మంది సంతృప్తిని వ్యక్తం పరిచారు. మొత్తంగా పొలిటికల్ క్రిటిక్స్ పోల్స్ సర్వే ప్రకారం.. ఏపీలో మరోసారి వైఎస్సార్ సీపీదే అధికారంమని తేల్చింది. అంటే మరోసారి వైఎస్ జగన్ సీఎం కానున్నారు. మొత్తంగా జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయ పడింది. ప్రస్తుతం పొలిటికల్ క్రిటిక్స్ సర్వే.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి.. తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.