iDreamPost
android-app
ios-app

ఆ సీటు విషయంలో రూటు మార్చిన నాగబాబు!

Nagababu: జనసేన లో ముఖ్య నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. గతంలో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆయన.. ఈ సారి రూట్ మార్చి మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Nagababu: జనసేన లో ముఖ్య నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. గతంలో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆయన.. ఈ సారి రూట్ మార్చి మరో స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ సీటు విషయంలో రూటు మార్చిన నాగబాబు!

ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. రోజులు గడిచే కొద్ది ఈ హీట్ బాగా పెరిగిపోతుంది. సామాన్య ప్రజల నుంచి ప్రధాన పార్టీల వరకు అందరూ ఈ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. అందుకే పొలిటికల్ కి సంబంధించిన ఓ వార్త వచ్చిన చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీ ప్రజల మూడ్ పక్కన పెడితే.. పార్టీల విషయానికి వస్తే.. అధికార వైసీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అలానే ప్రతిపక్ష టీడీపీ కూడా ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ  పార్టీలో కీలక నేత అయినా నాగబాబు విషయంలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన ఓ సీటు విషయం లో రూట్ మార్చారనే టాక్ వినిపిస్తోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ పార్టీలో నెంబర్ టూ, నెంబర్ త్రీగా  నాదెండ్ల మనోహర్,  నాగబాబు ఉన్నారు. నాగబాబు కూడా పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే తన రాజకీయ ఆలోచనలు సరిగ్గా అమలు చేయలేకపోవడం, స్థిరత్వం లేకపోవడం సరైన ప్రణాళిక.. వ్యూహాలు కొరవడ్డాయని, అందుకే చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. గతంలో 2019లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి జనసేన తరపున లోక్  సభకు పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో నాగబాబు రెండున్నర లక్షల ఓట్లన సంపాదించారు. అయినప్పటికీ ఆయనకు విజయం దక్కలేదు. అంతేకాక మూడో స్థానంలో నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాపులు ఎక్కువగా ఉన్న నరసాపురంలోనే నాగబాబు ఆ పరిస్థితి రావడంతో ఆయన తాజాగా మరో ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సారైనా చట్టసభల్లో అధ్యక్షా అనాలన్నది నాగబాబు ఆశగా కనిపిస్తోంది. చిన్న చిన్న యాక్టర్లే ఎమ్మెల్యేలు అవుతున్నారు..కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేను గెలుస్తా అనే ధీమాలో ఆయన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

2024 ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్న ఆయన మరోసారి లోక్ సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే గతంలో పోటీ చేసిన నరసాపురం నుంచి కాకుండా ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లి  నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీచ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి ఇలా రూటు మార్చారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి  ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయని పలువురు అభిప్రాయా పడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విశాఖలో  కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు, అలానే  కాపు నాయకులూ, వ్యాపారాలు, పారిశ్రామిక వేత్తలతోను తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇక అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారని తెలుస్తోంది.  ఇలా టీడీపీ నుంచి మరికొందరు కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి  సమయంలో  వారందరిని కాదని ఈ సారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లి నుంచి పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి. మొత్తంగా నాగబాబు నరసాపురం నుంచి అనకాపల్లికి రూట్ మార్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి..నాగబాబు పోటీ చేసే విషయంలో రూటు మార్చారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.