Arjun Suravaram
Chandrababu: శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వెళ్లిన కొందరు ఎమ్మెల్యేకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. తమకు సీటు వస్తుందని ఆశించిన ఆ ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురైంది.
Chandrababu: శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వెళ్లిన కొందరు ఎమ్మెల్యేకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. తమకు సీటు వస్తుందని ఆశించిన ఆ ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురైంది.
Arjun Suravaram
ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించి.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. తాజాగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను ప్రకటించింది. 118 స్థానాలకు తొలి జాబితాను ఈ పార్టీలు ప్రకటించాయి. ఇందులో 94 స్థానాలను టీడీపీ ప్రకటించింది. ఇంతవరకు బాగానే.. తాజాగా జాబితాలో వైసీపీని వీడి ..బాబుపై జై కొట్టిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఎంతగానో ఎదురు చూసిన టీడీపీ, జనసేన జాబితా రానే వచ్చింది. మొత్తం 118 స్థానాలకు జాబితాను ప్రకటించారు. ఇందులో వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్, ఆనం రామనాయణరెడ్డికి టీడీపీ షాకిచ్చింది. తాజాగా జాబితాలో తాడికొండ, ఉదయగిరి స్థానాలకు వీరి స్థానంలో కొత్తవారిని ప్రకటించారు. ఇక ఆనం రామనారాయణ రెడ్డి పేరు అయితే జాబితాలో కనిపించలేదు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని.. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి, చంద్రబాబుకు జై కొట్టి ఆ పార్టీలో చేరారు. అంతేకాక తమకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే లోకేశ్ పాదయాత్ర సమయంలో ఉండవల్లి శ్రీదేవి అయితే జై చంద్రబాబు అంటూ గట్టి ప్రసంగం చేశారు. తనను సీటు వస్తుందనే ఆశతో బాబుపై ప్రశంసల వర్షం కురిపించింది.
శ్రీదేవి తరహాలోనే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు గురించి గొప్పలు చెప్పారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో బాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. మొత్తంగా ఇంతా చేస్తే..తాజాగా విడుదలైన టీడీపీ, జనసేన జాబితాలో వారిలో ముగ్గురికి చంద్రబాబు మొండి చేయి చూపించారు. ఆనం రామనారయణ రెడ్డి పోటీ చేసే స్థానాలను ప్రకటించపోవడంతో ఆయన ఇంకా ఆశలు పెట్టుకున్నారు. అయితే శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం చంద్రబాబు గట్టి షాకిచ్చారనే వార్తలు వినిపిస్తోన్నాయి. తాడికొండ నుంచి తాను మరోసారి పోటీచేయాలని శ్రీదేవి భావించారు.
అయితే తాజా జాబితాలో ఆ స్థానంలో తెనాలి శ్రావణ్ కుమార్ పేరును టీడీపీ ప్రకటించి.. శ్రీదేవికి హ్యాండ్ ఇచ్చింది. అలానే ఉదయగిరిలోనూ కొత్త అభ్యర్థిని ప్రకటించి మేకపాటి చంద్రశేఖర్ కి కూడా భంగపాటు ఎదురయ్యేంది. అయితే చంద్రబాబు నమ్మించి మోసం చేయడంలో దిట్టని, అదే మరోసారి నిరూపించుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. అలానే ఆదరించిన పార్టీని మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పలువురు అంటున్నారు. మొత్తంగా వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే టాక్ వినిపిస్తోంది.