iDreamPost
android-app
ios-app

తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త! తప్పక తెలుసుకోండి!

  • Published Jul 30, 2024 | 6:38 PM Updated Updated Jul 30, 2024 | 7:26 PM

ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో ట్రాక్  మరమ్మత్తులు కారణంగా.. పలు రైల్లు రద్ద చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా తాజాగా రైల్వే అధికారులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. 

ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో ట్రాక్  మరమ్మత్తులు కారణంగా.. పలు రైల్లు రద్ద చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా తాజాగా రైల్వే అధికారులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. 

  • Published Jul 30, 2024 | 6:38 PMUpdated Jul 30, 2024 | 7:26 PM
తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త! తప్పక తెలుసుకోండి!

దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థలో రైల్వే వ్యవస్థ కూడా ఒకటి. అయితే ఇక్కడ ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. పైగా  ఈ రైలు ప్రయాణం ఇతర రవాణా వ్యవస్థలతో పొల్చితే  సౌకర్యవంతగా ఉంటుంది.  అలాగే టికెట్ ధర కూడా తక్కువ, తొందరగా గమ్య స్థానాకలు చేరిపోయే వెసులుబాటు ఉండటంతో.. అందరూ ఈ జర్నీనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే.. సామాన్య ప్రయాణికుల దగ్గర నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు సైతం తరుచు రైల్లలో ప్రయాణిస్తుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో ట్రాక్  మరమ్మత్తులు కారణంగా.. పలు రైల్లు రద్ద చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా తాజాగా రైల్వే అధికారులు బిగ్ అలర్ట్ ఇచ్చారు.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే అధికారులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. ఎందుకంటే.. తిరుపతి వెళ్లే  తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే రద్దు చేసింది. ముఖ్యంగా ఆరు రోజుల పాటు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే  విజయవాడ డివిజన్‌లోని మూడో లైన్‌లో జరుగుతున్న పనుల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే పలు రైళ్లను దారి మళ్లించినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. ఇక దారి మళ్లించిన రైళ్లు  విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆగవని తెలిపారు. ఇకపోతే 17488 నంబరుతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది.

అయితే అక్కడ నుంచి దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారంపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లి గూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ జంక్షన్, తెనాలి, నిడుబొర్లు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం ఏడున్నరకు కడపకు చేరుకుంటుంది.  కానీ, ప్రస్తుతం విజయవాడలోని మూడో లైన్ లో జరుగుతున్న మరమ్మత్తులు కారణంగా ఈ రైలును ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 10 వరకూ ఆరు రోజుల పాటు రద్దు చేశారు.

దీంతో 17487 నంబరుతో కడప నుంచి విశాఖకు వెళ్లే రైలు సర్వీసును కూడా ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు. అలాగే ఈ మార్గంలో ఇప్పటికే ఆయా రోజుల్లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు రద్దుతో పాటుగా మరో ఏడు రైళ్లను దారి మళ్లించారు. వైజాగ్- హైదరాబాద్ మధ్య నడితే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్- ఢిల్లీ మధ్య తిరిగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ రైల్వే స్టేషన్‌లలో అందుబాటులో ఉండవని తెలిపారు. వీటితో పాటు లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్ -హజ్రత్ నిజాముద్దీన్ మధ్యన నడిచే స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, వైజాగ్- సికింద్రాబాద్ గరీబ్‌రాథ్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- గాంధీధామ్ మధ్యన నడిచే వీక్సీ సూపర్ ఫాస్ట్ రైలు, విశాఖపట్నం-సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆగవని తెలిపారు.