iDreamPost
android-app
ios-app

లాంగ్ రైడ్ వెళ్లిన యువకులు.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు!

  • Author Soma Sekhar Published - 04:31 PM, Thu - 17 August 23
  • Author Soma Sekhar Published - 04:31 PM, Thu - 17 August 23
లాంగ్ రైడ్ వెళ్లిన యువకులు.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు!

ఓ ఐదుగురు యువకులు కలిసి సరదాగా అలా లాంగ్ డ్రైవ్ కు వెళ్దాం అనుకున్నారు. వారికి కారు కూడా అనుకూలంగా ఉంది. ఇంకేముంది రయ్ రయ్ మంటూ రోడ్లపై జాలీగా లాంగ్ రైడ్స్ కొట్టొచ్చని, రోజంతా ఎంజాయ్ చేయెచ్చని ఫుల్ ఖుషి మీద లాంగ్ రైడ్ కు బయలుదేరారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకునే లోపల అనుకోని సంఘటన జరిగి.. గ్రామస్తుల చేత దెబ్బలు తినాల్సి వచ్చింది. మరి ఆ యువకులు చేసిన పని ఏంటి? గ్రామస్తులు చెట్టుకు కట్టేసి ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కొనపల్లి శివారులో ఓ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు లాంగ్ రైడ్ కోసమని కారులో బయలుదేరారు. కానీ కొంత దూరం వచ్చాక వారి కారులో పెట్రోల్ అయిపోయింది. దీంతో యువకులు అర్ధరాత్రి ఓ ఇంటి ముందు ఉన్న బైక్ లో పెట్రోలో తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి బయట నిద్రిస్తున్న యజమాని సత్యనారాయణ అలికిడి విని లేచాడు. పెట్రోలు తీస్తున్న ఆ యువకులను దొంగలు అనుకుని వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.

దీంతో వారు సత్యనారాయణను తోసేసి పారిపోయేందుకు ప్రత్నించారు. ముగ్గురు యువకులు పారిపోగా.. ఇద్దరు మాత్రం గ్రామాస్తుల చేతికి చిక్కారు. ఆ ఇద్దరు యువకులను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు గ్రామస్తులు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. యువకులు జువ్వలపాలెంకు చెందిన వారుగా గుర్తించారు. అర్దరాత్రి పెట్రోల్ బంక్ లు లేకపోవడంతో.. పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించామని ఆ యువకులు తెలిపారు. బంధువల కారు తీసుకుని లాంగ్ డ్రైవ్ కు వచ్చారు ఈ కుర్రాళ్లు. మరి వినోదం కోసం వెళ్లి వివాదంలో చిక్కుకున్న ఈ యువకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: దేశంలోనే టాప్​లో నిలిచిన ఏపీ.. నాబార్డ్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు!