Arjun Suravaram
Pawan Kalyan: నాయకుడు అంటే.. తనను నమ్ముకున్న వారికి చేయి అందిస్తూ.. ముందుకు సాగేవాడు. కానీ కొందరు నాయకులు మాత్రం తాము ఎదిగేందుకు నమ్ముకున్న వారిని బలి పశువులను చేస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ అలాంటి పనే చేశారు.
Pawan Kalyan: నాయకుడు అంటే.. తనను నమ్ముకున్న వారికి చేయి అందిస్తూ.. ముందుకు సాగేవాడు. కానీ కొందరు నాయకులు మాత్రం తాము ఎదిగేందుకు నమ్ముకున్న వారిని బలి పశువులను చేస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ అలాంటి పనే చేశారు.
Arjun Suravaram
లీడర్.. ఈ పదం చూడడానికి మూడు అక్షరాలే అయినా.. దీనికుండే బాధ్యతలు ఎక్కువ. అలానే నాయకుడు అనే వాడు చెప్పే మాటలు, చేసే పనులు ఒకేలా ఉండాలి. ముఖ్యంగా తనను నమ్మిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదు. తన వెంట ఉన్నవారిని ఎదిగేలా చేస్తూ.. తాను ఎదిగే వ్యక్తే నిజమైన నాయకుడు. ఆ విధంగానే వైఎస్సార్ లాంటి వ్యక్తులు లీడర్లుగా ఎదిగారు. కొందరు మాత్రం నమ్మిన వారికి అన్యాయం చేస్తూ తమ స్వార్థం చూసుకుంటారు. ఈ కేటగిరీలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరుని కూడా చేర్చారు రాజకీయ విశ్లేషకులు. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం పవన్ ఈ వారాహి యాత్ర చేపట్టి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అలాంటి నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. ఇక తణుకు నియోజకవర్గం లో పవన్ చెప్పిన స్పీచ్ చూసి.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ స్థానిక జనసేన నేత విడివాడ రామచంద్రరావు గురించి ప్రస్తావించారు.
బలమైన నాయకుడు రామచంద్రరావుకు గత 2019 ఎన్నికల్లో సీటును కేటాయించకపోవడం తన తప్పిదమని ఆయనకు క్షమాపణ కోరుతున్నామని వేలాదిమంది ప్రజల మధ్య ఆర్భాటంగా ప్రకటించుకున్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో విడివాడ రామచంద్రరావుని కాదని పసుపులేటి వెంకట రమణారావు టికెట్ ఇస్తే అతను పార్టీ నుంచి వెళ్లిపోయాడని, కానీ టికెట్ ఇవ్వని విడివాడ మాత్రం ఇక్కడే నా కోసం ఉన్నాడని, ఇలాంటి వ్యక్తికి నేను సీటు ఇవ్వనందుకు బాధపడుతున్నాని పవన్ తెలిపారు. అంతేకాక అలా టికెట్ ఇవ్వనందుకు పబ్లిక్ గా క్షమాపణ చెప్పుకుంటున్నానని రెండో విడత వారాహి యాత్ర సందర్భంగా తెలిపారు.
ఆ సమయంలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులకు, డైలాగులతో జనసేన కార్యకర్తలు కేరింతలు కొడుతూ హంగామా చేశారు. అలానే చాలా కాలం వరకు తణుకు నియోజకవర్గ జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. ఇక సీన్ కట్ చేస్తే.. నేడు విడుదల చేసిన జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. వారాహి యాత్ర సమయంలో చెప్పిన మాటలకు, తాజాగా విడుదల చేసిన జాబితాలో విడివాడ పేరు ప్రస్తావించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాడు నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా విడివాడకు సీటు ఇవ్వకుండా టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు సీటు వదిలేశారు.
దీంతో పవన్ కల్యాణ్ పై విమర్శలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి పార్టీనే నమ్మకున్న రామచంద్రరావు లాంటి వ్యక్తి కోసం నిలబడని పవన్ కల్యణ్ ఇక జనసేనలో ఎవరికి న్యాయం చేస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరానికి తగ్గట్టు భారీ సినిమా డైలాగులు చెబుతూ.. అమాయక జనసేన కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించుకోవడం తప్ప మరేమి చేయడం లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలను పక్కన పెట్టి తన వారికి న్యాయం చేసే ధైర్యం పవన్ చేయడం లేదని.. అలా బాబును కాదని తన వారికి న్యాయం చేసినట్లు ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో తణుకు టీడీపీ అభ్యర్థిగా అరిమిల్లి రాధాకృష్ణ పేరు ప్రకటించడంతో జనసైనికులు పవన్ పై లోలోపల రగులుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.