దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు..మంత్రి రజిని వార్నింగ్!

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై మంత్రి రజనీ స్పందించారు. దాడి వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై మంత్రి రజనీ స్పందించారు. దాడి వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద దాడి జరగన సంగతి తెలిసిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆఫీసుపై ఆదివారం అర్థరాత్రి దాడి చోటు చేసుకుంది. మంత్రి రజిని పార్టీ ఆఫీస్‎పై రాళ్లతో దాడి చేశారు టీడీపీ, జనసేన కార్యకర్తలేనని టాక్ వినిపిస్తోంది.ఇక దుండగులు జరిపిన ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. ఆదివారం అర్దరాత్రి కొందరు టీడీపీ జెండా పట్టుకొని ఈ ప్రాంతంలో ర్యాలీ చేస్తూ.. అక్కడే ఉన్న మంత్రి కార్యాలయం మీద దాడి చేశారు. ఇక ఈ ఘటనపై మంత్రి రజనీ స్పందించడమే కాకుండా..గట్టి వార్నింగ్ సైతం ఇచ్చారు.

తన ఆఫీసుపై జరిగిన దాడి గురించి సోమవారం మంత్రి రజనీ మీడియాతో మాట్లాడారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానట్లు మంత్రి తెలిపారు. బీసీ మహిళనైనా తనను ఈ దాడులతో భయపెట్టలేరని తెలిపారు. అంతేకాక రాజకీయంగా తాను ఎదుగుతున్నది చూడలేక ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇక ఈ దాడి పక్క పధకం ప్రకారమే జరిగిందని ఆమె పేర్కొన్నారు. రాళ్లను తీసుకువచ్చి ఈ దాడికి  పాల్పడినట్లు ఆమె వెల్లడించారు. ఇక దాడిపై ఆమె సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. పోలీసులు కొందరిని ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి అంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడానికి తాను వచ్చినట్లు, తనకు ప్రజల మద్దతు ఉన్నంత వరకూ ఇలాంటి వాటిని ఎదుర్కొంటామని రజనీ తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతామని, చంద్రబాబు, నారా లోకేశ్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా ఆఫీస్ పై దాడి చేశారని మంత్రి  రజనీ అన్నారు.  ఈ దాడితో బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. లాఠీ ఛార్జ్ చేసినప్పటికి దాడిని కొనసాగించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ఆఫీస్ ను ప్రారంభించుకోవడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకో లేకపోతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడ్డి  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. టీడీపీ ఒకవైపు జయహో బీసీ అంటూనే మరోవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువుతారంటూ ఆయన తెలిపారు.

న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్థరాత్రి తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. మంత్రి కార్యాలయంపై రాళ్లు విసిరి.. బీభత్సం సృష్టించారు పచ్చ నేతలు. అంతటితో ఆగక కొందరు టీడీపీ కార్యకర్తలు.. మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి నానా రభస చేశారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. మరి.. మంత్రి రజిని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments