Arjun Suravaram
Vanga Geetha, Pawan Kalyan: సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పిఠాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగా గీతపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు తాజాగా వంగా గీత అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
Vanga Geetha, Pawan Kalyan: సోమవారం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పిఠాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగా గీతపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు తాజాగా వంగా గీత అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడం, ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఎన్నికల సంగ్రామంలో దూసుకెళ్తోంది. అలానే సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నం చేస్తుంది విపక్ష కూటమి. ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో, అసలు ఏం ఆలోచనతో మాట్లాడుతారో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటారు. అయితే ఆయన చేసే వ్యాఖ్యలకు వైసీపీ నేతలు అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా తనపై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు మాట మార్చిన ఆయన నామినేషన్ వేసే వరకు కూడా పవన్ మాటలపై నమ్మకం లేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయం పక్కన పెడితే.. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వంగా గీత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రజారాజ్యంతోనే రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఆమె జనసేనాలోకి రావాలని పవన్ వ్యాఖ్యనించారు. తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వంగా గీత కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఆమె పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో ప్రారంభమైందని పవన్ కల్యాణ్ అనడం సరైంది కాదని, 2009 కంటే ముందు నుంచే తాను రాజకీయాల్లో ఉన్నాని ఆమె తెలిపారు. అంతకంటే ముందు తాను వివిధ పదవుల్లో ఉన్నాని, రాజకీయంగా పిఠాపురంలో తమకు గట్టి పట్టుందని తెలిపింది. ఆ క్రమంలోనే 2009లో చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని ఆమె తెలిపారు. ఓటుకు లక్ష రూపాయలు ఇస్తున్నారని అనడం, తనను జనసేనాలోకి రావలని చెప్పడం విడురంగా ఉందని ఆమె తెలిపారు. ఇక పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఆమె తెలిపారు.. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉందని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడైన స్థానిక సమస్యలపై పోరాడుతూ ప్రజలల్లో గుర్తింపు పొందాలి కానీ… ఓడించడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు అనడం పరోక్షంగా పవన్ ఓటమిని ఒప్పుకుంటున్నారని ఆమె తెలిపారు.
ఒక పార్టీ అభ్యర్థిని తన పార్టీలో చేరమనడం.. రాజకీయ నాయకుడి లక్షణం కాదని ఆమె తెలిపారు. కావాలంటే.. ఆయననే వైఎస్సార్ సీపీలో చేరాలని వంగా గీతా తెలిపారు. పిలిస్తే పలికే వ్యక్తి వంగా గీత అని ఇక్కడి ప్రజలకు తెలుసని ఆమె తెలిపారు. బుధవారం పిఠాపురం నియోజవర్గంలోని పలు ప్రాంతాల్లో వంగా గీతా ఎన్నికల ప్రచారం చేశారు. ఆమెకు స్థానిక ప్రజలు బహ్మ రథం పట్టారు. వంగా గీతా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ పోటీ వేళ జనసేనకు ఇవాళ పెద్ద షాకే తగలబోతోంది. నియోజకవర్గ నేత మానినీడు శేషు కుమారి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆమె వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. మొత్తంగా పవన్ కల్యాణ్ కి ఎంపీ వంగా గీత అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మరి.. ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.