Vande Bharath Train: రైల్వే ప్రయాణికులుకు గుడ్ న్యూస్..వందేభారత్ ట్రైన్ కు ఆ స్టేషన్ లో హాల్ట్!

రైల్వే ప్రయాణికులుకు గుడ్ న్యూస్..వందేభారత్ ట్రైన్ కు ఆ స్టేషన్ లో హాల్ట్!

Vande Bharath Train: దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా పలు వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Vande Bharath Train: దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా పలు వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

మన దేశంలో ఉన్న రవాణ వ్యవస్థల్లో రైల్వే ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం  రైల్వే శాఖ అనేక సదుపాయాలను, కొత్త కొత్త ట్రైన్లను అందుబాటులోకి తెచ్చింది. అలానే వందే భారత్ ట్రైన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ప్రయాణికులకు మెరుగైన జర్నీ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ ట్రైన్లను అందుబాటులోకి తీచ్చారు. ఇక ఈ ట్రైన్ కి సంబంధించి ఓ విషయంలో రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. వందేభారత్ ట్రైన్ కు మరో కొత్త స్టేషన్ లో హాల్టింగ్  ఇచ్చారు. దీంతో ఆ ప్రాంత వాళ్ల జర్నీ హ్యాపీగా సాగనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా పలు వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ మధ్య ఈ వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.  సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 20833, 20834 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసింది.

ఈ నేపథ్యంలో చాలా తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట రైల్వే స్టేషన్‌లో హాల్ట్‌ను ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ స్టేషన్‌లో వందేభారత్ కు హాల్ట్ ఉండేది. ఈ స్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలకు రెగ్యులర్‌ హాల్ట్‌ లేదు. సామర్ల కోటలో హాల్డ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్  వచ్చింది. దీంతో ప్రయోగాత్మకంగా అక్కడ హాల్ట్ ను ఏర్పాటు చేసింది.

ఆరు నెలల పాటు అక్కడ వందే భారత్ ట్రైన్ ఆగేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ గడువు త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుంది.  తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల ఆ ప్రాంతంలోని ట్రైన్ ప్రయాణికులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వందే భారత్ ట్రైన్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అంతేకాక మరికొన్ని వందే భారత్ రైళ్లను రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా నడిపేందుకు కేంద్రం ఆలోచిస్తుంది. అలానే వందేభారత్ స్లిపర్ ట్రైన్ కూడా ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా తాజాగా తీసుకున్న నిర్ణయం సామర్ల కోట ప్రాంతం పరిధిలోని రైల్వే ప్రయాణికులుకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Show comments