Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన జైలుకు వెళ్లి నెలరోజులు దాటింది. స్కిల్ స్కామ్ కి సంబంధించిన వివిధ పిటిషన్లు సుప్రీం, హైకోర్టుల్లో ఉన్నాయి. ఇక చంద్రబాబు అరెస్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం సాగుతోంది. ఈ కేసులో బాబు పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి.. సీఐడీ అధికారులు అరెస్టు చేశారని, కోర్టులో బాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని వైసీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు.
శనివారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చంద్రబాబు అరెస్టుతో సహా వివిధ అంశాల గురించి ప్రస్తావించారు. ఇక చంద్రబాబు అరెస్టు విషయంలో కీలక అంశాలే ఉన్నట్లు తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏమి లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి.. సెంట్రల్ జైలుకు తీసుకెళ్తారా? అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. ఏదో ఒక దగ్గర ఆధారం ఉండే ఉంటుందని,అందుకే సుప్రీంకోర్టు,హైకోర్టులో ఈ కేసును ఎందుకు కొట్టేయలేదని ఆయన తెలిపారు. కోర్టులన్ని మాట్లాడుకుని చంద్రబాబుపై కక్ష కట్టాయా?. సోషల్ మీడియాలో ఊరికే పోస్టులు పెడితే ఏం లాభం ఉండదు. కొందరు ఇష్టం వచ్చినట్లు తన మీద మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్లి చూస్తే.. తాను ఏ ఏ అంశాల గురించి మాట్లాడుతున్నానో తెలుస్తుందని తెలిపారు.
“కొందరు అనవసరంగా నన్ను తిట్టడం కారణంగానే జనం ఉండవల్లి ఏం తిట్టారు అనే సందేహంతో నా వీడియోలు చూస్తార. అనసవరమైన విషయాల గురించి తప్పుడు పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగాలేదు అనుకుందాం.. ఆ విషయం గురించి కోర్టును అడగండి. చంద్రబాబును కోర్టు చెప్పంది కాబట్టి లోపల ఉంచుతున్నామని వైసీపీ నేతలు అనుకుంటేనే మీ మనుషులు కూడా మీతోనే ఉంటారు. ఈ కేసులో కీలక అంశాలనే ఉన్నాయి. ప్రధానంగా 17 A అనేది దానిపైనే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తీర్పు ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే” అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్