iDreamPost

APలో పెన్షన్ స్కీం అమలుపై సీఎం KCR కీలక వ్యాఖ్యలు!

APలో పెన్షన్ స్కీం అమలుపై సీఎం KCR కీలక వ్యాఖ్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పూర్తిగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి.. వాటి ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండిటిని జొడెద్దులా పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఏపీలో పెన్షన్ స్కీం అమలును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.

ఏపీలో పెన్షన్.. జగన్ ప్రభుత్వం దశలవారీగా పెంచుకుంటూ వెళ్తోంది. వచ్చే జనవరి నుంచి ఈ పెన్షన్ ను 3 వేలుగా అందించనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారమే..అధికారంలోకి వచ్చిన అనంతరం పెంచుకుంటూ వెళ్లారు. జనవరి నుంచి రూ.3 వేలు పెన్షన్ గా ఇవ్వనుంది. తాజాగా ఇదే పెన్షన్ స్కీం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. శనివారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను కేసీఆర్ విడుదల చేశారు.

హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించారు. ఇక మేనిఫెస్టోలో తెల్లరేషన్ కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా, రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ప్రారంభిస్తామని వెల్లడించారు. అలానే రైతు బంధు పథకం రూ. 16 వేల వరకు పెంచుకుంటూ వెళ్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.15 లక్షల వరకు పెంచుతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక్క గురుకులం ఏర్పాటు చేస్తామని,  అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అన్నపూర్ణ స్కీమ్ పేరుతో సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.

ఇక పెన్షన్ గురించి ప్రస్తావిస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఏపీలో పెన్షన్ స్కీమ్ చాలా విజయవంతంగా జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడ ఏటాది రూ.500లు పెంచుకుంటూ  రూ.3 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ కూడా రూ.500 పెంచుకుంటూ  రూ.5 వేల పెన్షన్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.  అలానే వికలాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచుతామని బీఆర్ఎస్ తెలిపింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి