iDreamPost
android-app
ios-app

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనానికి ఇదే మంచి అవకాశం

  • Published May 03, 2024 | 4:47 PM Updated Updated May 03, 2024 | 4:47 PM

ప్రస్తుతం వేసవి కాలం, సమ్మార్ సీజన్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే గంటల తరబడి క్యూ లైన్ లో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వాటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న టీటీపీ తిరుమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రస్తుతం వేసవి కాలం, సమ్మార్ సీజన్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే గంటల తరబడి క్యూ లైన్ లో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వాటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న టీటీపీ తిరుమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published May 03, 2024 | 4:47 PMUpdated May 03, 2024 | 4:47 PM
తిరుమల వెళ్లే భక్తులకు  గుడ్ న్యూస్.. దర్శనానికి ఇదే మంచి అవకాశం

భారత దేశంలో అత్యంత ప్రముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఏదంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పవచ్చు. పైగా ఈ తిరుమలనే కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే.. స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ పై వెలిసారు. అందుచేతనే ఆయనను కలియుగ ప్రత్యేక్ష్య దైవంగా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుడుని దర్శించుకోనేటకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలివెళ్తుంటారు.అలాగే ఎంతో ఓపికగా క్యూలైన్లలో శ్రీనివాసుని నామస్మరణం చేసుకుంటూ.. ఆయన దర్శనం భాగ్యం తరించుకుంటారు. కానీ, ప్రస్తుతం వేసవి కాలం, సమ్మార్ సీజన్ కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీపీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రతిఏటా వేసవికాలంలో కోట్లాది మంది భక్తులు ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండకు తరలివెళ్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా తిరుమలలో భక్తుల రద్దీ భారీగానే ఉంది. పైగా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ వేసవి ఎండాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గంటల తరబడి క్యూ లైన్ నిల్చొని ఉండాల్సి వస్తుండటంతో.. భక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న టీటీపీ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని టీటీపీ చెప్పుకొచ్చింది. కాగా, వేసవి కాలం కావడంతో.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  ఇక ఇవాళ జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  అయితే వేసవి రద్దీ, ఇతర పండుగల దృష్ట్యా మే నెలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని ఈవో చెప్పుకొచ్చారు.

ఇక వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేసినట్లు తెలిపారు.  అలాగే వీఐపీ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేసామమన్నారు. అంతేకాకుండా.. తిరుమలలోని క్యూలు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరం ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు ఈవో తెలిపారు.  అంతేకాకుండా.. ఆలయ మాడవీధుల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా షెడ్స్, కూలెంట్లు, కార్పెట్‌లతో పాటు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతున్నట్లు తెలిపారు. కాగా, నారయణ గార్డెన్స్, ఆలయ పరిసరాల్లో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు చలువ పందిళ్లు కూల్ పాయింట్లు వేసినట్లు ఈవో తెలిపారు. మరి, తిరుమలలో వేసవి దృష్ట్య భక్తుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న టీటీపీ తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.