Arjun Suravaram
TTD News: స్వామి వారి దర్శన వేళలు,ఇతర సేవలకు, తిరుమలలో గదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల భక్తులకు టీటీడీ ఓ కీలక సమాచారం ఇచ్చింది.
TTD News: స్వామి వారి దర్శన వేళలు,ఇతర సేవలకు, తిరుమలలో గదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల భక్తులకు టీటీడీ ఓ కీలక సమాచారం ఇచ్చింది.
Arjun Suravaram
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. స్వామి వారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు వస్తుంటారు. ఇక వారి కోసం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. అంతేకాక భక్తులు ఇబ్బంది పడకుండా.. వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటుది. ఇక స్వామి వారి దర్శన వేళలు,ఇతర సేవలకు, తిరుమలలో గదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు శ్రీవారి భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల భక్తులకు టీటీడీ ఓ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారికి సంబంధించిన కొన్ని దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
త్వరలో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో వివిధ అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం వయోవృద్ధులు దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీటితో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో బైక్ ల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. మొత్తంగా తిరుమల భక్తులు ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీవారి దర్శనంకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను నిర్వహించింది. శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులునడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలతో స్వామి వారి ఊరేగింపు జరిగింది. అలానే కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఇక గరుడ వాహనంపై ఉన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తుంటారు. మరి..శ్రీవారి దర్శనంకు సంబంధించి టీటీడీ ఇచ్చిన సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.