iDreamPost
android-app
ios-app

TTD అదిరిపోయే శుభవార్త.. వారందరికి పూర్తిగా ఫ్రీగా.. పూర్తి వివరాలివే..

  • Published Jun 10, 2024 | 9:11 AM Updated Updated Jun 10, 2024 | 9:11 AM

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మంచి మనసు చాటుకుంది. వారందరికి పూర్తి ఉచితంగా ఆ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మంచి మనసు చాటుకుంది. వారందరికి పూర్తి ఉచితంగా ఆ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 10, 2024 | 9:11 AMUpdated Jun 10, 2024 | 9:11 AM
TTD అదిరిపోయే శుభవార్త.. వారందరికి పూర్తిగా ఫ్రీగా.. పూర్తి వివరాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ.. కేవలం తిరుమల స్వామి వారి ఆలయ పర్యవేక్షణ, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు చూడటం మాత్రమే కాక.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలోనే టీటీడీ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బర్డ్‌ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తూ.. సామాన్యులకు సేవ చేస్తోన్న టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల సాయంతో మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. వారందరికి ఉచితంగా సేవ చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకు టీటీడీ తీసుకున్న నిర్ణయం ఏంటి.. ఎవరికి ఉచిత సర్వీసు అందించేందుకు రెడీ అయ్యింది.. ఏ సేవలు అంటే..

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న బర్డ్‌ ఆస్పత్రి శుభవార్త చెప్పింది. సుమారు 110 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేసింది. కొన్నిరోజుల క్రితం తమిళనాడుకు చెందిన సుబ్రమణియన్‌ అనే వ్యక్తి.. బర్డ్‌ ఆస్పత్రిలోని కృత్రిమ అవయవాల తయారీ కేంద్ర ఆధునీకరణకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ క్రమంలో బర్డ్‌ ఆస్పత్రి యూకే ఎండోలైట్‌ కంపెనీ వారి అత్యాధునిక సాంకేతిక సాయంతో.. ఎక్కువ కాలం మన్నే రీతిలో కృత్రిమ అవయవాలను తయారు చేసింది. వాటిని బాధితులకు పూర్తిగా ఉచితంగా అందించారు.

The good news of TTD is completely free for all

ఇక బర్డ్‌ ఆప్పత్రి చేస్తోన్న సేవలకు గాను ఎండోలైట్‌ కంపెనీ వారు తమ వంతు సాయం అందించారు. అనగా కృత్రిమ అవయవాల ధరలో 50 రాయితీ ఇచ్చారు. అల్యూమినియంతో తయారు చేసిన కృత్రిమ అవయవాలను టీటీడీకి అందించారు. వీటిని ధరించిన బాధితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సులభంగా నడవగలుగుతున్నారు. ఇదివరకు తాము జైపూర్, ఇతర ప్రాంతాల్లో త‌యారైన‌ కృత్రిమ అవయవాలను ఉపయోగించామ‌ని.. వాటికంటే కూడా ఈ అవయవాలు సౌకర్యవంతంగా ఉన్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, రోగుల బంధువులు పాల్గొన్నారు.

జూన్‌ 11న అయోధ్యకాండ అఖండ పారాయణ..

లోక కళ్యాణ కోసం జూన్‌ 11 న శ్రీవారిని ప్రార్థిస్తూ.. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై 11 వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరగనుంది. ఉదయం 7-9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్యకాండలోని 40-44వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 162 శ్లోకాలు, యోగ‌వాశిష్టం, ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 187 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్‌వీ వేద విఙ్ఞాన పీఠం, ఎస్‌వీ వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని సూచించారు.