iDreamPost
android-app
ios-app

పండగక్కి ఊరెళ్లుందుకు ఏర్పాట్లు..అంతలోనే విషాదం!

ఆ ఇద్దరు పండగక్కి ఊరెళ్లెందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఇక వారికి అవసరమైన సరకులను, ఇతర వస్తువులను సిద్ధం చేసుకున్నారు. అయితే విధి వారిని పండగ జరపుకోనివ్వలేదు. ఓ మూల మలుపు వారి జీవితాన్ని మలుపు తిప్పి.. తిరిగి రాని లోకానికి పంపింది.

ఆ ఇద్దరు పండగక్కి ఊరెళ్లెందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఇక వారికి అవసరమైన సరకులను, ఇతర వస్తువులను సిద్ధం చేసుకున్నారు. అయితే విధి వారిని పండగ జరపుకోనివ్వలేదు. ఓ మూల మలుపు వారి జీవితాన్ని మలుపు తిప్పి.. తిరిగి రాని లోకానికి పంపింది.

పండగక్కి ఊరెళ్లుందుకు ఏర్పాట్లు..అంతలోనే విషాదం!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మర్రిపాడుకు చెందిన జన్ని లోకనాథం(25) జీవన ఉపాధి కోసం విశాఖ జిల్లా వచ్చాడు. ఇక్కడ చినగదిలి దరి హెల్త్‌సిటీలో జరుగుతున్న ఓ భవన నిర్మాణంలో తాపీమేస్త్రిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసమైన రేకుల్ షెడ్ లో ఉంటున్నాడు. లోకనాథం గ్రామానికి చెందిన, అతడి బంధువు కూర్మనాథపురం మీనా(30) అక్కడి మరో రేకుల షెడ్‌లో ఉంటోంది. మీనా సాగర్‌నగర్‌ దరి గుడ్లవానిపాలెంలోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. వీరిద్దరు ఓకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఒకరికొక్కరు సాయం చేసుకునే వారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో లోక్ నాథం .. తన బైక్ పై మీనాను హోటల్ వద్ద దించేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే

 శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో లోకనాథం బైక్‌పై ఆమెను హోటల్‌ వద్ద దించేందుకు వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై విశాఖ వేలీ స్కూల్‌ కూడలి వద్ద కు చేరుకున్నారు. అక్కడి నుంచి సాగర్‌నగర్‌ వైపు మలుపు తిరుగుతుండగా.. వెనుకనే వస్తున్న లారీ..వీరి బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో వారిద్దరు బైక పై నుంచి కింద పడి లారీ వెనుక చక్రాల మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో లోక్ నాథం, మీనా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తోటి వాహనాదారులకు కంటతడి పెట్టించింది. కాగా.. ప్రమాదానికి కారణమైన లారీ ముడి ఇనుము లోడుతో నగరం నుంచి సాలూరు వెళుతోంది.

ఈ ప్రమాదం జంక్షన్ లో జరగడంతో.. నగరం నుంచి మధురవాడ వైపు వెళ్లే వాహనాలు డెయిరీఫాం వరకు వరకు నిలిచిపోయాయి. ఈ మార్గం మొత్తం భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. లోకనాథం అవివాహితుడు కాగా, మీనాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  విబేధాల కారణంగా ఆమె కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ హోటల్‌లో పనిచేస్తోంది స్థానికులు అంటున్నారు. సంక్రాంతి పండగను జరుపుకునేందుకు శనివారం ఇద్దరు సొంతూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని సహచరులు కన్నీరు పెట్టుకున్నారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ విషాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.