iDreamPost
android-app
ios-app

పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి.. చివరకు!

ప్రతి మహిళ తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటుంది. అలానే ఓ మహిళ కూడా ఆర్థికంగా పెద్ద ఆస్తులు లేకపోయిన కూలీ పనులు చేసుకుంటూ వచ్చే సంపాదనతో భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తుంది. అలానే పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఆమె చివరకు ఏమైందటే..

ప్రతి మహిళ తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటుంది. అలానే ఓ మహిళ కూడా ఆర్థికంగా పెద్ద ఆస్తులు లేకపోయిన కూలీ పనులు చేసుకుంటూ వచ్చే సంపాదనతో భర్త, పిల్లలతో హాయిగా జీవిస్తుంది. అలానే పొట్ట కూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఆమె చివరకు ఏమైందటే..

పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి.. చివరకు!

ప్రతి ఒక్కరు  తమ జీవితం ఎంతో సంతోషంగా సాగాలని కోరుకుంటారు. ధనవంతుల నుంచి పేద వారి వరకు అందరూ సంతోషంగా జీవించాలని ఆశ పడుతుంటారు. అలానే ఓ పేద కుటుంబానికి చెందిన మహిళ కూడా భర్త, పిల్లలతో హాయిగా జీవించాలని ఆశ పడింది. భర్త వ్యవసాయ పనులు చేస్తుంటే ఆయనకు తోడుగా సదరు మహిళ కూడా కూలీ పనులకు వెళ్తుంది. అలా ఆ వివాహిత కుటుంబం ఆనందంగా జీవిస్తున్న తరుణంలో విధి విషాదం నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలి తీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా గన్నవరం నియోజవర్గంలోని ఆగిరిపల్లి మండలం చిన్నఆగిరిపల్లి శివారు గొల్లగూడేనికి చెందిన 22 మంది మహిళలు కూలీ పనుల నిమిత్తం ఆటోలో కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లికి వెళ్తున్నారు. మార్గంమధ్యలోని వీరపనేనిగూడెం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ఆటోకు ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని వచ్చింది. ఆ బైక్ ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఒక్కసారిగా ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వీర్ల కృష్ణకుమారి(43) అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అలానే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. వీర్ల సుజాత(33) అనే మహిళ మృతి చెందింది. అంతేకాక ఈ ప్రమాదంలో19 మంది గాయపడ్డారు.

చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.  వీరిలో కొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఒకరైన వీర్ల సుజాత భర్త గోపాలకృష్ణ వ్యవసాయ పనులు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఈ దంపతులకు 7, 9 ఏళ్ల   వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనికి వెళ్లిన సుజాత  విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ చిన్నారుల, బంధువుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇక   ఈ రోడ్డు ప్రమాదాల్లో ఈ మహిళల మాదిరిగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి.. ఇలా రోడ్డు ప్రమాదాలకు బలైన  వారు ఎందరో ఉన్నారు. నిత్యం జరిగే ఇలాంటి ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకుంటాయి. అలానే ఎంతో మంది పిల్లలు అనాథలు మిగులుతున్నారు. మొత్తంగా ఇలా ఎవరో చేసే తప్పుకు అమాయకులు బలై పోతున్నారు. మరి.. ఈ ఘోర విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.