iDreamPost
android-app
ios-app

ఏపీకి వాతావరణ హెచ్చరిక..ఆ జిల్లాలో వర్షాలు

ఏపీకి వాతావరణ హెచ్చరిక..ఆ జిల్లాలో వర్షాలు

కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అయితే కొన్ని రోజుల నుంచి వాతారవణం పగటి పూట ఎండలు, సాయంత్ర వేళ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వానాలు పలు నగరాలు జలమయ్యం అయ్యాయి. వానలు అంటే జనం భయపడేలా పరిస్థితి మారింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోనే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  తెలిపింది. తెలిక పాటి నుంచి ఓ మోస్తారు వానాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈశాన్య బుతుపవనాలు దక్షిణ భారతదేశం వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు దక్షిణ భారత్‌ లోని వివిధ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలానే వానాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

శనివారం కోస్తా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉత్తరాంధ్రాలోని పలు జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం రాత్రికి కూడా రాయలసీమ ప్రాంతంలో చిరు జల్లులకు అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల క్యుములో నింబస్ మేఘాలు వస్తున్నాయని.. అవి వచ్చిన ప్రాంతంలో మాత్రమే భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అధికారులు . ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై మేఘాలు ఉన్నాయని ఆవర్తనం ఏర్పడితే వానలు కురిసే అవకాశం ఉందని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి