ఆకతాయికి దేహశుద్ది చేసిన స్థానికులు.. ఎందుకంటే?

Prakasam Crime News: ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. రోడ్డుపై వాహనాలు ఇష్టానుసారంగా నడుపుతూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

Prakasam Crime News: ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. రోడ్డుపై వాహనాలు ఇష్టానుసారంగా నడుపుతూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

ఈ మధ్య కాలంలో దేశంలో పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనం రోడ్లపై ఇష్టానుసారంగా నడిపి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఓ ఆకతాయికి స్థానికులు సరైన బుద్ది చెప్పారు. ఈ ఘటన ఒంగోలులో జరిగింది. వివరాల్లోకి వెళితే

ఒంగోలు టౌన్ లో కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పోలీస్ హారన్ బిగించి ఆకగాయి నగర రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పాదాచారులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేర్నమిట్టకు చెందిన ఓ వ్యక్తి తన సోదరుడితో కలిసి ఇంటిరియర్ డెకరేషన్ పనులు చేస్తున్నాడు. ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. అయితే మూడు నాలుగు రోజుల నుంచి పగలు, రాత్రి అనే తేడా లేకుండా కారుకు పోలీస్ హారన్ బిగించి రోడ్లపై హారన్ కొడుతూ నానా హంగామా చేస్తున్నాడు. శనివారం పేర్నమిట్టలోని ఒక హూటల్ యజమానిని భయపెట్టేందుకు ప్రయత్నించగా అతను సదరు కారు నడుపుతన్న వ్యక్తిపై పెట్రోల్ చల్లినట్లు చెబుతున్నారు.

అటుగా రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకువెళ్లి ఆటపట్టించాడు.. దీంతో ఆ మహిళ కిందపడి దెబ్బలు తాకాయి. ఆ మహిళ బంధువులు ఆగ్రహానికి గురై ఆ యువకుడిని పట్టుకుని పేర్నమిట్ట బస్టాండ్ లోని డివైడర్ వద్ద పోల్ కి తాళ్లతో కట్టేసి చితకబాదారు. మరోవైపు ఇతను చేస్తున్న న్యూసెన్స్ పై ఫిర్యాదు రావడంతో పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలియజేశారు. ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకంటామని పోలీసు అధికారి తెలిపారు.

Show comments