iDreamPost
android-app
ios-app

ఓ వైపు ఎన్నికల హడావుడి.. ఆ గ్రామంలో అర్థరాత్రి శబ్దాలు.. తీరా చూస్తే

ఏపీలో ఎన్నికల హడావుడి. ఆ గ్రామం అంతా వీటి గురించే చర్చిస్తుంది. అయితే మరుసటి రోజు మాత్రం ఎన్నికల గురించి కన్నా.. దాని గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు.

ఏపీలో ఎన్నికల హడావుడి. ఆ గ్రామం అంతా వీటి గురించే చర్చిస్తుంది. అయితే మరుసటి రోజు మాత్రం ఎన్నికల గురించి కన్నా.. దాని గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు.

ఓ వైపు ఎన్నికల హడావుడి.. ఆ గ్రామంలో అర్థరాత్రి శబ్దాలు.. తీరా చూస్తే

మరో రెండు రోజుల్లో ఎన్నికలు. ఓ వైపు ఎలక్షన్స్ హడావుడి. ఆ గ్రామమంతా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇక ఎవరి ఇళ్లల్లో వాళ్లు తలుపులు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఆ గ్రామం అంతా నిద్రపోతున్న సమయంలో అలజడి. అంతలో అర్థరాత్రి సౌండ్స్. స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలు కూడా కావడంతో.. ఏదో పనులు జరుగుతున్నాయని భావించారు. కానీ తెల్లారే సరికి చూస్తే అవాక్కవ్వడం గ్రామం వంతైంది. ప్రతి ఒక్కరు ఇలా జరిగింది ఏంటమ్మా అని నోళ్లబెట్టారు. చివరకు ఎందుకు ఇలా జరిగింది. ఎందుకు ఇలా చేశారు అని మాట్లాడుకున్నారు. ఎన్నికల గురించి కన్నా.. దీని మీదే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే…

గుప్త నిధులు ఉన్నాయని, గుడిలోని లింగాన్ని తవ్వేశారు దుండగులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని చోటుచేసుకుంది. బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలోని పురాతన ముక్తేశ్వరాలయం ఉంది. ఆ గుడిలో శనివారం అర్థరాత్రి సమయంలో శబ్దాలు వినిపించాయి. స్థానికులు ఏవో పనులు జరుగుతున్నాయని అనుకున్నారు. కానీ తెల్లవారగానే పూజలు నిర్వహించేందుకు గుడికి వెళ్లారు ఆ ఆలయ పూజారి. గుడిలోకి ఇలా అడుగుపెట్టారో లేదో ఒక్కసారిగా అవాక్కయ్యాడు పూజారి. ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని పెకిలించినట్లు కనిపించింది. తీరా వెళ్లి చూడగా.. గోతి తవ్వి కనిపించింది. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్థులకు సమాచారం అందించాడు.

నంది విగ్రహాన్ని పెకిలించడం చూసిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రాంగణంలోకి ప్రవేశించి చూడగా.. విగ్రహం తవ్వి ఉండటాన్ని గమనించారు. అయితే గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో ఇలా తవ్వి ఉంటారని భావిస్తారు. ఇప్పుడు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టడం గురించి స్థానికంగా కలకలం రేపింది. తవ్వకాల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులను, గుడి పూజారి, గుడి కమిటీ సభ్యులను విచారణ చేపడుతున్నారు.  నిందితులను పట్టకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.