Parvathipuram Manyam District: మంచి ఉద్యోగాలు.. బంగారం లాంటి జీవితం.. కానీ

మంచి ఉద్యోగాలు.. బంగారం లాంటి జీవితం.. కానీ

Parvathipuram Manyam District: గత నెల రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి.

Parvathipuram Manyam District: గత నెల రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి.

దేశ వ్యాప్తంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లలో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణలో రాబోయే రోజుల్లు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.వారిద్దరూ మంచి ఉద్యోగం చేస్తున్నారు.. తమ విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అటువైపు రావొద్దని గ్రామస్థులు హెచ్చరించారు.. అంతలోనే ఏం జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ వాగు పొంగి ప్రవహిస్తుంది.. ఆ విషయం అర్థం కాక ఇద్దరు ఉపాధ్యాయులు అటుగా వచ్చారు. నీటి ప్రవాహం పెరుగుతుంది.. వాగు వైపు రావొద్దని స్థానికులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులను హెచ్చరించారు. కానీ వారికి తెలుగు అర్థం కాకపోవడంతో అలాగే ముందుకు వచ్చారు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో మహిళా ఉద్యోగిని మరణించగా.. ఉపాధ్యాయుడి ఆచూకీ గల్లంతైంది. పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలంలోని కోటికి పెంటలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అక్కడ వసతి సరిపోకపోవడంతో సరాయివల గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల క్రితం హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్తి (23), మహేష్ ఇక్కడికి బోధించడానికి వచ్చారు.

ఇద్దరు ఉపాధ్యాయులు గురివినాయుడపేటలో ఉంటూ పాఠశాలక వెళ్లి వచ్చేవారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో రాయిమాను వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీరు కాజ్ వేపైకి చేరింది. స్థానికులు వీరిని గమనించి వెనక్కి వెళ్లిపోవాలాని గట్టిగా అరిచారు.. కానీ వారిద్దరికీ భాష అర్థం కాకపోవడంతో ముందుకు రావడంతో వాగులో కొట్టుకుపోయారు. కొంతసేపటి తర్వాత ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేష్ చెట్టుకొమ్మని పట్టుకొని ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొమ్మ విరిగిపోవడంతో నదిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులు, గ్రామస్థుల సాయంతో వాగు పొడవునా కిలోమీటర్ మేర గాలించగా ఆర్తి మృతదేహం, ద్విచక్ర వాహనం గుర్తించారు. మహేష్ ఆచూకీ లభించలేదు.

Show comments