Arjun Suravaram
17 మంది చిన్నారులకు కరెంట్ షాక్ కొట్టిన అందరిని ఆందోళనకు గురి చేసింది. పండగ పూట ఎంతో సంతోషంగా గడుపుతున్న చిన్నారులు అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కి గురయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిదంటే..
17 మంది చిన్నారులకు కరెంట్ షాక్ కొట్టిన అందరిని ఆందోళనకు గురి చేసింది. పండగ పూట ఎంతో సంతోషంగా గడుపుతున్న చిన్నారులు అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కి గురయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిదంటే..
Arjun Suravaram
ప్రతిఒక్కరు పండగలు, వివిధ శుభకార్యాలు వంటి వాటిల్లో పాల్గొన్ని సంతోషంగా గడుపుతుంటారు. ముఖ్యంగా పండగల సమయంలో గ్రామాల్లోని పెద్దలు, యువకులు,చిన్నారులు ఎంతో సందడి చేస్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను ఊరిగేస్తూ పండగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని సార్లు అలాంటి వేడుకల్లో ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. ఉగాది వేడుకల్లో పాల్గొన్న 17 మంది చిన్నారుల విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లాలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్విహించారు. అయితే ఓ ప్రాంతంలో జరిగిన ఉగాది ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలనే గ్రామస్థులు భావించారు. అలానే రథోత్సవం నిర్వహించాలని ఆ గ్రామస్తులు భావించారు. ఆ విధంగానే చిన్నటేకూరు గ్రామస్తులు రథోత్సవం నిర్వహించారు. ప్రభలు ముందుకు సాగుతున్న సమయంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. గ్రామంలో ఊరేగుతున్న ప్రభలకు విద్యుత్ తీగలు తగలాయి. దీంతో రథంపై ఉన్న 17 మంది చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా రథంపై నుంచి కింద పడిపోయారు. ఈక్రమంలో ఆ పిల్లలు స్పృహ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్పృహ కోల్పోయిన పిల్లలకు సీపీఆర్ చేసి.. స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అలానే గాయాలైన చిన్నారుల్ని హుటాహుటిన కర్నూలు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారులకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా సందడి చేసిన ఆ చిన్నారులు అకస్మాత్తుగా కరెంటు షాక్కు గురికావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఎంతో ఆందోళన గురయ్యారు. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గ్రామస్తులు అనేక చర్యలు తీసుకున్నారు. అలా ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ప్రమాదం జరగడం ఒకసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రథం ఊరేగే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఆ కారణంతోనే రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మొత్తంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.