iDreamPost
android-app
ios-app

వీడియో: తల్లిదండ్రులు జాగ్రత్త.. బాలుడి ప్రాణం తీసిన కరెంట్ తీగలు!

Kadapa News: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ కి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు కరెంట్ తీగలు యమపాశాలుగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒళ్లు గగుర్పొటిస్తోంది.

Kadapa News: ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ కి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు కరెంట్ తీగలు యమపాశాలుగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒళ్లు గగుర్పొటిస్తోంది.

వీడియో: తల్లిదండ్రులు జాగ్రత్త.. బాలుడి ప్రాణం తీసిన కరెంట్ తీగలు!

పిల్లల్ని ఒంటరిగా పంపించే తల్లిదండ్రలులు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో జరిగిన ఓఘటన అందరిని కలచి వేస్తుంది. కరెంట్ తీగ కారణంగా అభం శుభం తెలియని ఓ బాబుని పోగా, మరో బాబు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. కడప పట్టణంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

ఏపీ రాష్ట్రం కడప కు చెందిన తన్వీర్‌ (11), అద్నాన్ అనే ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. బుధవారం ఉదయాన్నే స్కూల్ కి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో ఇంటికి వెళ్లారు. తిరిగి స్కూల్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  సంతోషంగా ఆ ఇద్దరు  విద్యార్థులు సైకిల్ పై పాఠశాళకు తిరిగి బయలు దేరారు. ఇక వీధి మూలమలుపుకు వచ్చే సరికి అక్కడే కరెంట్ వైర్లు రోడ్డుపైకి వేలాడుతూ ఉన్నాయి. అలా రోడ్డుకు అడ్డంగా వేలాడుతున్న ఆ కరెంట్ వైర్లు సైకిల్ పై వెళ్తున్న విద్యార్థులకు తాకాయి. దీంతో వారిద్దరు అక్కడికక్కడే సైకిల్ తో సహా పడిపోయారు.

తన్వీర్ ఘటనా స్థలంలోనే మరణించాడు. అతడి ఒంటిపై నిప్పులు కూడా చెలరేగాయి.  మరొకర విద్యార్థి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండంగా.. స్థానికులు గమనించారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి.. బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బాబు ప్రాణాలు తీసిందని.. స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడమే కాకుండా..నెటిజన్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాబు ప్రాణాన్ని తీసిందెవరు? ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పేదెవరు? స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఈఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన విద్యార్థికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి చికిత్స ఖర్చులు భరించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.