iDreamPost
android-app
ios-app

ముద్దు కోసం వెళ్లిన భర్త.. నాలుక కొరికేసిన భార్య!

ముద్దు కోసం వెళ్లిన భర్త.. నాలుక కొరికేసిన భార్య!

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. మన పూర్వీక కాలం నుంచి కూడా దంపతుల మధ్య గొడవలు అనేది జరుగుతూనే ఉన్నాయి. అయితే వాళ్లు సర్ధుకుని పోతూ.. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. అయితే నేటికాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య అహం అనేది బాగా పెరిగిపోయింది. అలానే ఓ చిన్న గొడవ జరిగిన సర్థుకునే స్వభావం దంపతుల్లో కరువైంది. ఈక్రమంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా ఓ భార్య.. తన భర్త నాలుకను కొరికేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం  ఎల్లంగుట్ట తండా కు చెందిన పుష్పావతి,  గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్   ప్రేమించుకున్నారు. ఇద్దరు పెద్దలను ఒప్పించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.  చాలా కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే రెండేళ్లగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా పుష్పావతి, నాయక్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో భార్య ఒక్కసారిగా భర్త తారాచంద్ నాయక్ నాలుకను కొరికేసింది. కుటుంబ సభ్యులు గమనించి.. వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై జొన్నగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ దంపతులు ఇద్దరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

తన భార్య.. మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, తనతో నిత్యం గొడవ పెట్టుకుంటుందని తారా చంద్ నాయక్ ఆరోపించారు. అంతేకాక తనను చంపేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించాడు. తన తండ్రి కూడా నెలనెల డబ్బులు పంపిస్తున్నాడని నాయక్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికి తన భార్య ఇలా చేయడం బాధగా ఉందని కన్నీరు పెట్టుకున్నాడు. తన పిల్లల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే పుష్పావతి మాత్రం మరోలా చెప్తుంది. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టేందుకు వచ్చాడని, అందుకే అతడిపై దాడి చేశానని భార్య పుష్పవతి అంటున్నారు.  ఆమె కూడా జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  ట్రయాంగిల్ లవ్ స్టోరీ! ప్రేమకు అడ్డొస్తున్నాడని స్నేహితుడి దారుణ హత్య..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom