Arjun Suravaram
ఓ దంపతులు కూడా తమ కొడుకు విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఖర్చులకు సైతం వెనుకాడకుండా అన్నీ సమకూర్చారు. కానీ ఆ కొడుకు వచ్చిన చెడు వ్యసనం ఆ తల్లిదండ్రుల పాలిట మరణ శాసనంగా మారింది.
ఓ దంపతులు కూడా తమ కొడుకు విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఖర్చులకు సైతం వెనుకాడకుండా అన్నీ సమకూర్చారు. కానీ ఆ కొడుకు వచ్చిన చెడు వ్యసనం ఆ తల్లిదండ్రుల పాలిట మరణ శాసనంగా మారింది.
Arjun Suravaram
ప్రతి ఒక్కరు తమ బిడ్డలను ఎంతో కష్టపడి చదివించి… ప్రయోజకులైతే చూడాలని కలలు కంటారు. అలానే ఓ దంపతులు కూడా తమ కొడుకు విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఖర్చులకు సైతం వెనుకాడకుండా డిగ్రీ చదవడానికి బెంగళూరు. అయితే అక్కడ వారి కుమారుడు ఓ చెడు వ్యసనానికి అలవాటు అయ్యాడు. అతడి వ్యసనం ఆ తల్లిదండ్రుల పాలిట మరణ శాసనంగా మారింది. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఉదారు మహేశ్వరరెడ్డి (45), ప్రశాంతి (39) దంపతులు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నిఖిల్ రెడ్డి అనే ఒక్కాగానొక్క కొడుకు ఉన్నాడు. అతడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ..నిఖిల్ ను చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడుకు బాగా చదువుకోవాలని డిగ్రీకి బెంగళురు పంపారు. అయితే అక్కడ నిఖిల్‌రెడ్డి చదువుపై ధ్యాస కంటే..బెట్టింగ్ లపై కన్నుపడింది. దీంతో ఆ బెట్టింగ్ ఊబీలోకి నిఖిల్ రెడ్డి చిక్కుకున్నాడ సమాచరం.
ఈ క్రమంలోనే బెంగళూరులో నిఖిల్ ఆన్‌లైన్ బెట్టింగుల్లో భారీగా డబ్బులు కోల్పోయి రూ.2.40 కోట్ల మేర అప్పులు చేసినట్లు సమాచారం. వాటి తీర్చేందుకు మహేశ్వరెడ్డి దంపతులు తమకు ఉన్న పదెకరాల భూమి, ఇల్లు, వ్యవసాయ కల్లం అన్నీ విక్రయించారు. అయినా కూడా ఆ అప్పులు పూర్తిగా తీరలేదు. దీంతో మిగిలిన అప్పు తీర్చాలని అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడంతో మామ వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన మూడు ఎకరాల భూమినీ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. కొనేవాళ్లు దాన్ని మరీ చాలా తక్కువ ధరకు అడగడం మహేశ్వరెడ్డి దంపతుల మనస్సు కలచివేసింది. దీంతో ఆ దంపతులు మంగళవారం దారుణ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి అబ్దుల్లాపురం సమీపంలోని పొలానికి వెళ్లి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక బుధవారం తెల్లవారుజామున అటువైపు వెళ్లిన స్థానికులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కొందరు కుమారుడు తల్లిదండ్రుల ప్రేమను చెడు వ్యసనాలకు వాడి.. చివరకు వారికే మరణ శాసనం రాస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా నిఖిల్ అడిగినంత డబ్బులు ఇవ్వడంతో జూదం వ్యసనంగా మారి..రూ.కోట్లలో అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి కుటుంబ పరువు పోతుందని ఆస్తి మొత్తం అమ్మినా అప్పులు పూర్తిగా తీరకపోగా.. అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిళ్లు అధికం కావడంతో వారిద్దరు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాద ఘటన కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.