iDreamPost
android-app
ios-app

ఓ చిన్నపొరపాటు.. కొడుకును కాటేసి..కన్నీరు మిగిల్చింది!

తల్లిదండ్రులారా.. మీ బిడ్డలను గమనించుకుంటూ ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కన్నేసి ఉంచితే బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇది తప్పని సరి. లేకుంటే మీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

తల్లిదండ్రులారా.. మీ బిడ్డలను గమనించుకుంటూ ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఒక్కన్నేసి ఉంచితే బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇది తప్పని సరి. లేకుంటే మీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఓ చిన్నపొరపాటు.. కొడుకును కాటేసి..కన్నీరు మిగిల్చింది!

ఈ భూమి మీద బిడ్డలపై కన్నవారికి ఉన్న ప్రేమ..మరెవరికి ఉండదు. తమ బిడ్డలకి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటారు తల్లిదండ్రులు. అయితే అలా అల్లారు ముద్దుగా పెంచుకునే తమ బిడ్డలను.. ఆ కన్నవారు చేసే చిన్న పొరపాటులో బలి తీసుకుంటాయి. కొందరు.. తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయాలను పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నమవుతారు. అయితే అలావారు చూపే చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు. అది ఎంత అంటే ఓ ప్రాణం ఖరీదు  కూడా అవుతోంది. అలాంటి ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను వింటే ఎవరి గుండైనా బరువెక్కాల్సిందే. రెక్కాడితే గాని డొక్కాడని ఓ కుటుంబం.. ఉన్నంతలో సంతోషంగా సాగిపోతున్నారు. ఆ కుటుంబంలో ముద్దు మాటలు పలికే ఓ బాబు కూడా ఉన్నాడు. వాడిని చూసుకుంటూ ఆ దంపతులు మురిసిపోతుంటారు. కానీ ఆ ఫ్యామిలీని విధి వెక్కిరించి.. శోకసంద్రంలోకి నెట్టేసింది. ఆ తండ్రి చేసిన చిన్న పొరపాటు.. కన్నకొడుకును బలి తీసుకుంది.

A small mistake bit the son and left tears!

కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామాని చెందిన వరిగంజి మురళీకృష్ణ, రుచిత భార్యాభర్తలు. మురళీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు రిషిక్ అనే నాలుగేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇక ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇద్దరు బిడ్డలను కంటిక రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుంటూ ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. అయితే ఇటీవలే ఆ ఇంట్లో ఓ చిన్న పొరపాటు కారణంగా విషాదం చోటుచేసుకుంది.

గత బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న రిషిక్ కి బయట ఆటో శబ్దం వినిపించింది. తన తండ్రి వచ్చాడనే సంతోషంతో పరిగెత్తుకుంటూ బయటకి వచ్చాడు. ఇక తన బిడ్డ వచ్చిన విషయాన్ని గమనించని మురళీ ఆటోను పార్క్ చేస్తున్న సమయంలో రివర్స్ లో వస్తున్నాడు. ఇదే సమయంలో మురళీ కుమారుడు రిషిక్ ఆటో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అదే ఆటోలో గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రిషిక్‎ను పరిశీలించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు.

ఇక అప్పటి వరకు తమతో సంతోషంగా తిరిగిన బిడ్డ విగత జీవిగా మారడంతో ఆ కన్నవారు అల్లాడిపోయారు. గుండెలు పగిలేలా రోధించారు. దేవుడా..మేము ఏం పాపం చేశామయ్యా, ఇలా చేశావు అంటూ విలపించారు. కనీసం గాయాలతోనైనా తన కొడుకుని బతికిస్తే బాగుండే అని గుండెలు పగిలేలా రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బంధువులు సైతం బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కృష్ణాజిల్లా మోటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా పెద్దలు పిల్లల విషయంలో నిర్లక్ష్యగా ఉండటంతో అనేక విషాదాలు జరుగుతుంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.