iDreamPost

వాలంటీర్ సాహసం.. అగ్నిగుండంలో దూకి వ్యక్తి ప్రాణాలు కాపాడాడు!

వాలంటీర్ సాహసం.. అగ్నిగుండంలో దూకి వ్యక్తి ప్రాణాలు కాపాడాడు!

గట్టు మీద నుంచోని ఎవరైనా మాటలు చెబుతారు. కానీ, కింద కాలు పెట్టి రంగంలోకి దిగాలి అంటేనే చాలా మంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. సాధారణంగా ఏ చిన్న పని చేయాలి అన్నా ఒక్క అడుగు ముందుకు వేయాలి అంటే లక్షసార్లు ఆలోచిస్తారు. అదే ప్రాణాలమీదకు వచ్చే పనైతే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఆ వాలంటీర్ మాత్రం అందరూ వెనక్కి తగ్గిన సమయంలో అడుగు ముందుకు వేశాడు. అందరూ చూస్తూ నిల్చుంటే అతను మాత్రం అగ్నిగుండంలో దూకి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. అతనికి ఏమౌతుందో అని కూడా ఆలోచన చేయకుండా సాహసం చేశాడు.

సాధారణంగా ఎవరైనా ప్రాణాపాయస్థితిలో ఉంటే చాలా మంది అయ్యో పాపం అంటారు. ఇంకొందరు ఎవరైనా రక్షించండి అంటారు. చాలా కొద్ది మంది మాత్రమే అడుగు ముందుకు వేసి ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపడతారు. ఆ కోవకు చెందిన వ్యక్తే వాలంటీర్ చాపల సురేశ్. అసలు ఏం జరిగిందంటే.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం ఓ.కొత్తపల్లిలో పీర్ల చావిడి వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో బాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు అగ్నిగుండంలో పడ్డాడు. అక్కడ ఉన్నవాళ్లంతా అలా చూస్తూ ఉండిపోయారు. కానీ, వాలంటీర్ చాపల సురేశ్ మాత్రం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిగుడంలోకి దూకి బాషాను బయటకు తీశాడు. ఈ ప్రమాదంలో బాషాకు వీపు మొత్తం కాలిపోయింది. అతడిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సాహసం చేసిన వాలంటీర్ సురేశ్ కు కూడా కాళ్లు కాలిపోయాయి. అతను ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడున్న వందలాది మంది అయ్యో పాపం అన్నారే తప్ప ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ, వాలంటీర్ సురేశ్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంతటి సాహసం చేశాడు. అతని సాహసానికి ప్రతిఫలంగా బాషా అంతటి ప్రామాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సురేశ్ చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. బాషాని కాపాడేందుకు సురేశ్ చేసిన సాహసాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. బాషా ప్రాణాలతో ఉన్నాడు అంటే అందుకు కారణం సురేశ్ అంటూ ప్రశంసిస్తున్నారు. బాషా కుటుంబం కూడా సురేశ్ రుణపడి ఉంటాం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి