iDreamPost
android-app
ios-app

రాగుల, జొన్నలతో సిద్ధి వినాయకుడు! ఫోటోలు వైరల్..

రాగుల, జొన్నలతో సిద్ధి వినాయకుడు! ఫోటోలు వైరల్..

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒక్కటి. ఈ పండగను రోజున వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు మండపాలపై కొలువుదీరుతారు. ఇక ఈ ఏడాది కూడా వినాయక చవితికి అన్ని మండపాలు సర్వసుందరగం సిద్ధమయ్యాయి. విద్యుత్ ,దీపాలతో మండలపాను అలకరించారు. ఇదే సమయంలో వెరైటీగా వినాయకుడి ప్రతిమలను రూపొందిస్తున్నారు. ఆకులతో, డబ్బులతో, ధాన్యాలు, చిల్లర, కాగితాలు, పూలు వంటి వివిధ రకాల వాటితో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తాజాగా విశాఖ నగరానికి చెందిన మోకా విజయ్ కుమార్ అనే చిత్రకారుడు తాయరు చేసిన చిరు ధాన్యాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇటీవల దిల్లీలో రెండు రోజుల పాటు జీ-20 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ సదస్సులో విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్‌ తయారు చేసిన చిరు ధాన్యాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కుమార్ రైల్వేలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి విశాఖలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగంతో పాటు వివిధ రకాల చిత్రాలను రూపొందిస్తుంటారు. ఇప్పటికే పలు రకాల విగ్రహాలను విజయ్ కుమార్ తయారు చేశాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవు కలిగిన మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. అంతేకాక ఆ ప్రతిమకు రాగులు, సామలు, అరికెలు, కొర్రలు, నల్ల సామలు, జొన్నలు వంటి చిరుధాన్యాలతో అలంకరించాడు.

ఈ విగ్రహాన్ని జీ-20 సదస్సులో ప్రదర్శించాడు. ఇంకా చెప్పాలంటే గణపతి విగ్రహం కావటంతో సదస్సు జరిగే ప్రాంగణం మొదట్లోనే పెట్టే అవకాశం కూడా దక్కింది. విదేశీ ప్రతినిధులంతా తొలుత వినాయకుడిని దర్శించిన తర్వాతనే వేదిక వద్దకు చేరుకునేవారు. వినాయకుడి ప్రతిమతో పాటు రైతు జీవన శైలిని వివరించేలా, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు రైతు పడే కష్టాల చిత్రాలను ప్రదర్శించారు. అంతేకాక పలువురు ప్రముఖుల చిత్రాలను చిరుధాన్యాలతో తయారు చేసి జీ-20 వేదిక వద్ద ప్రదర్శించారు. ఐక్యరాజ్య సమితి 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ విగ్రహాన్ని తయారు చేశానని విజయ్ కుమార్ చెబుతున్నాడు.