iDreamPost

11 దేశాల్లోనే కనిపించే అరుదైన పిల్లి గుంటూరులో..! ప్రత్యేకతలు ఇవే..

11 దేశాల్లోనే కనిపించే అరుదైన పిల్లి గుంటూరులో..! ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలో  అనేక జాతుల జంతువులు ఉంటాయి. వాటిలో చాలా అరుదుగా కొన్ని జంతువులు ఉంటాయి. అలాంటివిలో బావురు పిల్లి ఒకటి. దక్షిణ ఆగ్నేయా ఆసియా దేశాల్లో మాత్రమే ఈ అరుదైన పిల్లి కనిపిస్తుంది. ఈ బావురు పిల్లి అంతరించి పోతున్న జాబితాలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2000లోపే ఈ జాతి పిల్లులు ఉన్నట్టు అంచనా. కేవలం 11 దేశాల్లో మాత్రమే ఈ బావురు పిల్లులు కనిపిస్తుంటాయి. అలాంటివి ఇటీవలే ఉమ్మడి కృష్ణ, గుంటూరు అభయారణ్యం ప్రాంతంలో  ప్రత్యేక్షమయ్యాయి. వీటిని మనుషులు వేటాడకుండా తీరప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

చేపలను వేటాడి జీవించే ఈ జాతి పిల్లులను ప్రాంతాలను బట్టి బావురుపిల్లి, పులి బావుర, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్‌ క్యాట్‌ అని పిలుస్తారు. ఈ బావురు పిల్లి 78 సెం.మీ పొడవు, 8.8 కిలోల వరకూ బరువు పెరుగుతుంది. ఈ పిల్లి రాత్రి వేళల్లో మాత్రమే చేపలను వేటాడి జీవిస్తుంది. ఇక ఈ పిల్లుల ఆకారం మన ఇళ్లలో తిరిగే పిల్లుల కంటే పెద్దవిగాను చిరుత పులి కంటే చిన్నవి గాను ఉంటుంది. అచ్చు చిరుత పులిని పోలి ఉంటుంది. ఇది చేపల వేటకు వెళ్లే సమయంలో ఆ పరిసరాల్లో మల, మూత్ర విసర్జన చేయడంతో  ఇతర జాతి పిల్లులు, జంతువులు ఆ పరిసరాలకు రావు. అంతరించిపోతున్న ఈ జాతిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఏటా వణ్యప్రాణి వారోత్సవాల్లో  నిర్వహిస్తున్నారు. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అటవీ తీర గ్రామాల్లో అటవీశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరి.. ఈ అరుదైన జాతి బావుర పిల్లి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి