P Krishna
TDP Leaders Arrest: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీ నేతలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
TDP Leaders Arrest: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీ నేతలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
P Krishna
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా నేతల ప్రచారాలతో దుమ్ము రేపుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికలు అన్ని పార్టీల నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రచారాలు ఓ వైపు.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పంపకాలు మరోవైపు సాగిస్తున్నారు. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఎన్నికల కమీషన్ అధికారులు, పోలీసులతో చెక్ పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నగదు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా మద్యం, బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈసీ కొరడా ఝులిపిస్తున్నా వీరు మాత్రం తమ పద్దతి మార్చుకోవడం లేదు. తాజాగా ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం పంచుతున్న టీడీపీ నేతల నుంచి సెబ్ అధికారులు భారీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే..తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్ ని పట్టుకున్నారు సెబ్ అధికారులు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మెదుగు వెంకటేశ్వర్లు, షేక్ షాహిన్ పాషా, జినుగు అశోక్ లను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈసారి అధికార పార్టీ గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైఎస్సాఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాము చేసిన అభివృద్దిని చూసి మరో ఛాన్స్ ఇవ్వాలంటూ బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.