iDreamPost

షాకింగ్ పోస్ట్ చేసి.. డిలీట్ చేసిన అక్షర్ పటేల్! వరల్డ్ కప్ నుంచి కావాలనే తప్పించారా?

  • Author Soma Sekhar Published - 06:25 PM, Fri - 29 September 23
  • Author Soma Sekhar Published - 06:25 PM, Fri - 29 September 23
షాకింగ్ పోస్ట్ చేసి.. డిలీట్ చేసిన అక్షర్ పటేల్! వరల్డ్ కప్ నుంచి కావాలనే తప్పించారా?

క్రికెట్ లో ఆటగాళ్లకు గాయాలు కావడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ గాయాలు కొన్నిసార్లు ప్లేయర్లను తప్పించడానికి సాకుగా మారతాయనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకుని, గాయం కారణంగా చివరి నిమిషంలో టీమ్ నుంచి తప్పుకున్నాడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ అక్షర్.. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ కు కూడా అందుబాటులో లేడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత షాకింగ్ పోస్ట్ చేసి.. వెంటనే దానిని డిలీట్ చేశాడు అక్షర్ పటేల్. అయితే అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.

అక్షర్ పటేల్.. గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టు మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్ టీమ్ నుంచి నిష్క్రమించిన అనంతరం సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేశాడు అక్షర్. అయితే ఆ పోస్ట్ ను వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో కావాలనే వరల్డ్ కప్ నుంచి అక్షర్ ను తప్పించారా? అనే అనుమానాలు అతడి పోస్ట్ ద్వారా కలుగుతున్నాయి అంటున్నారు నెటిజన్లు.

ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే? “కామర్స్ కు బదులుగా సైన్స్ చదివుంటే బాగుండేది. అలాగే ఓ మంచి పీఆర్ ను పెట్టుకుంటే బాగుండేది” అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు. అయితే పెట్టిన కొద్దిసేపటికే ఈ స్టోరీని డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూస్తుంటే.. గాయం నుంచి కోలుకున్నాగానీ కావాలనే అతడిని తప్పించారన్న ఫీలింగ్ తోనే అతడు ఈ పోస్ట్ చేసినట్లు అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మంచి పీఆర్ దొరకడం వల్లే అశ్విన్ వరల్డ్ కప్ జట్టులోకి వచ్చినట్లుగా ఇన్ డైరెక్ట్ గా అక్షర్ సెటైర్ వేశాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Axar patel not in team

అయితే ఈ పోస్ట్ అతడి కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా జట్టులో చోటు కోల్పోయిన రాయుడు, సాహా, పృథ్వీ షాలు ఇలాంటి పోస్ట్ లే పెట్టి కెరీర్ ను ముగింపు దశకు తెచ్చుకున్నారు. కాగా.. అక్షర్ పటేల్ ఆవేదనంలో అర్ధం ఉందని కొందరు వాదిస్తున్నారు. అతడు వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ మిస్ అవ్వడం ఇది మూడోసారి. గతంలో 2015 వరల్డ్ కప్ కు ఎంపికైనా.. రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. తర్వాత 2019 వరల్డ్ కప్ కు అక్షర్ ఎంపిక కాలేదు. ఇప్పుడు ఎంపికైనా గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. మరి అక్షర్ పటేల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి