iDreamPost
android-app
ios-app

బాబు ఆరోగ్యంపై టీడీపీ అసత్య ప్రచారం.. మరి ఇంతా దిగజారాలా?

బాబు ఆరోగ్యంపై టీడీపీ అసత్య ప్రచారం.. మరి ఇంతా దిగజారాలా?

రాజకీయాలు అనేవి చాలా హుందాగా ఉండాలి. కానీ కొన్ని పార్టీలు అలాంటి హుందాతనాన్ని మరచి మరీ ప్రవర్తిస్తుంటాయి. ప్రతి విషయాన్ని రాజకీయం, ఓట్ల పరంగా తమకు ఎలా కలిసి వస్తుందనే ఆలోచనే తప్ప.. మరేమి ఆలోచించారు. ఓట్ల కోసం, సానుభూతి కోసం ఎంతో దారణంగా దిగజారి ప్రవర్తిస్తుంటారు. ఆ కోవాకు చెందిన పార్టీలో టీడీపీ ఒకటనే టాక్ వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటే కూడా టీడీపీ నేతలు దిగాజారి అనారోగ్యంగా ఉన్నాడంటూ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సానుభూతి కోసం ఇంతా దిగజారాలా అంటూ పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో  మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా  ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 34 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారు. అయితే ఆయన జైలుకు వెళ్లిన తొలి రోజు నుంచి నేటి వరకు కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు. అలానే ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రత్యేక గదితో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తూ, నిరంతరం వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ములాఖత్ తో చంద్రబాబును కలిసిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బయటకు వచ్చి అసత్య ప్రచారాలు చేయడం ప్రారంభించారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని, స్కిన్ అలర్జీతో బాధ పడుతున్నారంటూ ప్రచారం చేశారు. అంతేకాక చంద్రబాబు ప్రాణహాని ఉందంటూ ఒకడగు ముందుకేసి మరి తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.

అయితే గురువారం జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ చంద్రబాబు ఆరోగ్యం గురించి కీలక అంశాలు వెల్లడించండంతో టీడీపీ దొంగ నాటకలు బయట పడ్డాయని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు 65 నుంచి 65 కిలోల వెయిట్ పెరిగారని, ఆయన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. చంద్రబాబుకు స్కిల్ అలర్జీ ఉన్నట్లు వాస్తవని డీఐజీ రవి కిరణ్ తెలిపారు. దీంతో టీడీపీ నేతలు చేసిన ప్రచారాలు అసత్యమని బట్టబయలు అయింది. అయితే ప్రజల్లో సానుభూతి రాలేదని ఇలాంటి నీచ, దిగజారుడు రాజకీయం చేయడం అవసరమా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రజల సమస్యల గురించి పోరాడితే గుర్తింపు  ఉంటుంది, కానీ ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ రాజకీయాలు చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ చేసిన ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.