iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం!

  • Author singhj Published - 11:14 AM, Fri - 15 September 23
  • Author singhj Published - 11:14 AM, Fri - 15 September 23
ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు అండగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు సర్కారు ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తోంది. అంటే ఐదు సంవత్సరాల్లో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని స్త్రీలకు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. గర్భిణీ స్త్రీల కోసం ప్రధాన మంత్రి వందన యోజన స్కీమ్​ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా గర్భిణీలకు రూ.5 వేలను ప్రభుత్వం ఇస్తోంది.

ఇదే కోవలో తమిళనాడులో మహిళలకు స్టాలిన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్కీమ్​లకు తోడుగా మహిళలకు ఊరటనిచ్చే మరో కీలక పథకాన్ని మొదలుపెట్టేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమైంది. అధికార పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేస్తూ ఇంటికి దీపమైన మహిళలకు కనీస ఆదాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త స్కీమ్​ను ప్రారంభించనుంది. డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి అయిన సెప్టెంబర్ 15న ఈ కొత్త పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు. మహిళల ప్రాథమిక ఆదాయం పేరుతో ఈ స్కీమ్​ను మొదలుపెట్టనున్నారు.

మహిళల ప్రాథమిక ఆదాయం పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన 1.06 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,000 లభించనున్నాయి. స్టైఫండ్ రూపంలో దీన్ని వాళ్లకు చెల్లించేందుకు స్టాలిన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పేదరిక నిర్మూలన, లింగ సమానత్వాన్ని పెంచడానికి ఈ స్కీమ్ ఓ సాధనంగా అవుతుందని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని ప్రారంభించిన తేదీ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమవుతాయని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ అమౌంట్ విత్​డ్రా కోసం లబ్ధిదారులకు ఏటీఎం కార్డులు కూడా జారీ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఇదీ చదవండి: ఆ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త!