Arjun Suravaram
విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తరచూ వారికి ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంది. తాజాగా క్రీడలకు సంబంధించి విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ అందింది. అయితే ఇది అన్ని జిల్లాల్లో మాత్రం కాదు.
విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తరచూ వారికి ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంది. తాజాగా క్రీడలకు సంబంధించి విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ అందింది. అయితే ఇది అన్ని జిల్లాల్లో మాత్రం కాదు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యం పెంచుతున్నారు. అలానే విద్యార్థుల చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. తరచూ ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తాజాగా ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులు ఈ గుడ్ న్యూస్. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. 50 ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మే 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభిచనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధి కార సంస్థ అధికారి ఏ.జగన్మోహనరావు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు పలు శిక్షణ కేంద్రాల ద్వారా ట్రైనింగ్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని గ్రామీణ, మేజర్ పంచాయతీలు, మండల, జిల్లా కేంద్రాల్లో పలు క్రీడల్లో ఉచిత ట్రైనింగ్ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ శిబిరాలకు పాల్గొనేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పీఈటీలు, జాతీయ క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారుల నుంచి విశాఖ జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని తెలిపారు. అలానే ఈ శిబిరాల్లో క్రీడా శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి కలిగిన వారు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తులను పాడేరులో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ ఆఫీసుకు దరఖాస్తులు ఇవ్వొచ్చు.
క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొనేందుకు 8 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులు. వారికే క్రీడా శిబిరాల ద్వార శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కొరకు 90002 74225 నెంబర్ లో సంప్రదించాలని జిల్లా అధికారులు తెలిపారు. 8 నుంచి 14 ఏళ్ల లోపల పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఆఫీస్ లో అందించాలని జిల్లా అధికారులు వివరించారు. మరి.. విద్యార్థులకు వేసవిలో ఇలాంటి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.