iDreamPost
android-app
ios-app

నమ్మిన సైన్యంతోనే ఎన్నికల యుద్ధం.. ఇది కదా జగన్!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న పట్టుదల, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతమంది తనను వదిలేసి వెళ్లినా ఎక్కడా అధైర్యానికి గురికారు. ప్రత్యర్థులందరూ ఏకమైనా..యుద్ధానికి సిద్దం అంటున్నారు. ఆయన బలం ఏమిటంటే...

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న పట్టుదల, ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతమంది తనను వదిలేసి వెళ్లినా ఎక్కడా అధైర్యానికి గురికారు. ప్రత్యర్థులందరూ ఏకమైనా..యుద్ధానికి సిద్దం అంటున్నారు. ఆయన బలం ఏమిటంటే...

నమ్మిన సైన్యంతోనే ఎన్నికల యుద్ధం.. ఇది కదా జగన్!

నాయకుడు అనే పదానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. అయితే తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తనను నమ్ముకున్న వారితో కలిసి నడిచే వారు నాయకులు. లీడర్లుగా చలామణి అయ్యే వారందరూ ఈ కోవకు చెందిన వారు కాదు. తనను నమ్మినవారికి చేయి అందిస్తూ.. తాను అభివృద్ధి చెందేవాడే అసలైన నాయకుడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. తన సైన్యంలో ఎంతమంది మోసం చేసి, ప్రత్యర్థులకు దాసోహమైనా భయపడరు. తనకంటూ ఉన్న.. తననే నమ్మిన సైన్యంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి నాయకులు చరిత్ర పుటల్లో నిలుస్తుంటారు. రాజకీయ కురుక్షేత్రంలో.. శత్రువులతో పోరాటం చేస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలోకే చేరుతారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అలా సీఎం అనే పిలుపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంత ఈజీగా రాలేదు. ఎంతో మంది దుర్యోధనులు, శకునులు, రావణాసురుల వంటి వారితో పోరాటం చేశారు. వారు పెట్టిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడే కానీ.. ఎక్కడా భయపడి వెనుకడుగు వేయలేదు. ఇక్కడ జగన్ కి ఉన్న ఒకే ఒక్క ధైర్యం.. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తన కోసం నిలబడే వారు, తనను నమ్మిన వారు వెనకాల ఉన్నారు. అందుకే 2009 నుంచి 2019 వరకూ సీఎం అయ్యే వరకు తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొందరు నాయకులు జగన్ ను నమ్మి ఆయన వెంటే ఉన్నారు. ఎంతో మంది వివిధ ప్రలోభాలకు ఆశపడి.. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వదలిపోయారు. కొందరు మాత్రం.. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. భరించారే కానీ జగన్ ని విడిచిపెట్టలేదు.

అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జగన్ కి అండగా ఉండటంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ పార్టీలోనే చాలా మంది అవకాశవాదులు..తాము ఆశించినది దక్కలేదని.. పార్టీని వదలుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా ఒక వైపు ఉంటే.. టీడీపీ, జనసేన, కొత్తగా కాంగ్రెస్, వంటి పార్టీలన్ని మరోవైపు ఉన్నాయి. ఇలా పార్టీలు మారే వారు మారుతున్నా, ప్రత్యర్థులు గుంపులుగా వచ్చినా జగన్ మాత్రం ఎక్కడడా అధైర్యానికి గురికావడం లేదు. కారణం.. ఆయనకంటే నమ్మిన సైన్యం ఒకటి ఉంది. అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు వెళ్లినా..ఆందోళనకు గురి కాలేదు.

ఇటీవల వైఎస్సార్సీపీ విడుదల చేసిన పార్లమెంట్, అసెంబ్లీ జాబితాలు చూసినట్లు అయితే.. జనం బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ప్రకటించిన పలు కీలక పార్లమెంట్ స్థానాల్లో జగన్ ను నమ్మి ఆయన వెంట నడిచిన వారే ఉన్నారు. జగన్ ను ఆరాధించే వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒకరు. జగన్ ఏం చెబితే అది చేసేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే.. జగన్ ఆదేశాలతో తన సొంత జిల్లాను వదిలి పల్నాడు జిల్లా నర్సారావు పేట లోక్ సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయనను జగన్ మోహన్ రెడ్డి ఆత్మ అని  చాలా మంది అంటుంటారు. తాను పోతే వైసీపీ దిక్కులేదనే ధీమాతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. ఇంతకాలం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి.. నమ్మించి మోసం చేసి వెళ్తే.. జగన్ ఎక్కడా అధైర్య పడలేదు. వెంటనే విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంట్ ఇన్ ఛార్జీగా ప్రకటించారు. అలానే ఒంగోలు లోక్ సభకు తనకు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. అలానే తిరుపతి పార్లమెంట్ కు గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాల్లో ఎక్కువ మంది.. తనను నమ్మి తన వెంట నడిచిన వారే. ఇలానే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గుడివాడ అమర్ నాథ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి పలువురు వైసీపీ నేతలతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థులు మొత్తం ఏకమై.. గుంపులుగా కురుక్షేత్రంలోకి దిగితే.. తనను నమ్మిన వారితో కలిసి సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారు.