iDreamPost
android-app
ios-app

APలో ఆకాశమంత అంబేద్కర్.. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పూర్తి వివరాలు!

Statue Of Social Justice: దేశంలో బలహీన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం మధ్య స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో 206 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభిస్తారు.

Statue Of Social Justice: దేశంలో బలహీన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం మధ్య స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో 206 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభిస్తారు.

APలో ఆకాశమంత అంబేద్కర్.. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పూర్తి వివరాలు!

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, పేదల పాలిట ఆశ జ్యోతి అయినా డా.బి.ఆర్ అంబేడ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. నేడు ఎంతో మంది దళితులు, ఇతర బలహీన వర్గాల వారు అత్యున్నతమైన పదవుల్లో ఉంటున్నారు అంటే అందుకు కారణం ఆ మహనుభావుడే. ఇక ఆయన ఆశయాలను నిజం చేస్తూ… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ముందుకు సాగుతున్నారు. అంతేకాక ప్రపంచలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇక అంబరాన్ని అంటుకునేలా ఉన్న ఈ అంబేడ్కర్ విగ్రహం అందరిని ఆకట్టుకుంది. ఈ విగ్రహా ప్రత్యేకలు, విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా..

దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ జరిగింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. గురువారం ఈ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మహా విగ్రహాన్ని నిర్మించింది.

అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు:

భారత దేశంలోనే మతాతీతమైన విగ్రహాల్లో ఈ విగ్రహం అతి పెద్దది.  విగ్రహం మొత్తం ఎత్తు 206(81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగులు ఉంటుంది. విగ్రహం బరువు 465 టన్నులు ఉంది. ఈ విగ్రహం తయారీ కోసం 112 మెట్రిక్ టన్నుల కంచు, 352 మెట్రిక్ టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో, 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్ ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు,4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. అలానే ఈ అంబేడ్కర్ స్మృతివనం మొత్తం 18.81 ఎకరాల విస్తీరణంలో ఉంది. అలానే స్వరాజ్ మైదానంలో 8.9 ఎకరాలలో పచ్చదనం  కోసం కేటాయించారు. అలానే అంబేడ్కర్ విగ్రహం కిందిభాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫోర్లో లో నాలుగు హాల్స్ ఉంటాయి. అందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు అంబేడ్కర్  చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి.

Vijayawada ambedkar statue details

మొదటి ఫ్లోర్ లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక అంబేడ్కర్ కు సౌత్ ఇండియాతో ఉన్న అనుబంధాన్ని డిస్ ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్ లో లైబ్రరీ ఉంటాయి. ఇక రెండవ ఫ్లోర్ లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్ లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి ఈ స్మృతివనం ప్రాంగణాన్ని  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ను రూపొదించారు. ఇక్కడ 75 మంది సిట్టింగ్ సామార్థ్యం ఉంది.

ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవితాన్ని తెలిపే అతి పెద్ద మ్యూజియం. మినీ థియేటర్ల, ఫుడ్ కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వాహనాల పార్కింగ్ ఉన్నాయి. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ లు ఉన్నాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర్ పీఠం ను రూపొందించారు. విగ్రహం పీఠం లోపల జి ఫ్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రేపిజీయిం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు.

ఏఐ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే  ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియోను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు.  ఇక ఈ విగ్రహ నిర్మాణం కోసం స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి 500-600 మంది కూలీలు పని చేశారు. రెండేళ్ల పాటు మూడు షిప్ట్ ల్లో వీరందరూ పని చేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. ఇక ఈ స్మతివనాన్ని వీక్షించేందుకు జనవరి 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు. మరి.. ఏపీలోని ఈ ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ విశేషాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.