తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ!

South Central Railway: వరుస సెలవులు రావటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారు ఐదురోజులు సెలవులు రావటంతో సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

South Central Railway: వరుస సెలవులు రావటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణాలు పెరిగాయి. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారు ఐదురోజులు సెలవులు రావటంతో సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటం ట్రైన్స్ లో ప్రయాణించేందుకు ఎక్కువ  ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ప్యాసింజర్లకు రైల్వే శాఖ అనేక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

గత గురువారం నుంచి  వచ్చే సోమవారం వరకు వరుస సెలవులు ఉన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో నగరాల్లో ఉండే ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. కొందరు బంధువుల ఇళ్లకు మరికొందరు విహార యాత్రలకు వెళ్తున్నారు.  ఈ నేపథ్యంలోనే రైళ్లు, బస్సులు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో రైళ్లలో రిజర్వేషన్లు సైతం ఫులై.. వెయిటింగ్ లిస్ట్ జాబితా భారీగా ఉంటుంది. ఇక వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. మరో 8 స్పెషల్ ట్రైన్స్ లను సౌత్ సెంట్రల్ రైలు నడపనుంది.

ఇక దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన స్పెషల్ ట్రైన్స్ వివరాలు చూసినట్లు అయితే…18వ తేదీన నర్సాపూర్‌ – సికింద్రాబాద్‌, 19వ తేదీన సికింద్రాబాద్‌ – నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలానే ఆగష్టు 15, 17, 19వ తేదీల్లో కాకినాడ నుంచి సికింద్రాబాద్‌,  ఆగష్టు16, 18, 20 తేదీల్లో సికింద్రబాద్‌ నుంచి కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే రోజూ 210 రైళ్లను నడుపుతోంది. మొత్తంగా వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-నర్సాపూర్, కాకినాడ-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి రూట్లల్లో ఈ రైళ్లు నడుస్తాన్నాయి.  ఆగష్టు 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు వివిధ సంస్థలకు సెలవు ఉండటంతో జనాలు సొంతూర్లకు పయనం అవుతున్నారు. గత రెండు రోజుల నుంచి బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింత పెరిగనుంది. ఈ నేపథ్యంలోనే వీకెండ్ లో ఊర్లకు వెళ్తున్నవారికి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు అనేది పెద్ద శుభవార్తే అని చెప్పొచ్చు. ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల విషయాలను గుర్తుంచకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.

Show comments