మెగా ఫ్యామిలీని కాదని YCPకి బన్నీ ప్రచారం! అసలు.. ఈ ఇద్దరి స్నేహం ఎలా మొదలైంది?

Allu Arjun, Shilpa Ravi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బన్నీ మద్దతుత తెలిపారు. ఈ నేపథ్యంలో అందరికి వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Allu Arjun, Shilpa Ravi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బన్నీ మద్దతుత తెలిపారు. ఈ నేపథ్యంలో అందరికి వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది.  నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో బిజిబిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఈసారి పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొని సందడి చేశారు. మాములుగానే హీట్ పుట్టేంచే ఏపీ ఎన్నికలు సెలబ్రిటీల ప్రచారం మరితం హీటెక్కెతున్నాయి. తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బన్నీ మద్దతుత తెలిపారు. తన స్నేహితుడు రవికి బన్నీ విషెష్ తెలిపారు. ఈ నేపథ్యంలో అందరికి వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అసలు వారి స్నేహం ఎలా మొదలైందంటే..

ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం ఫ్రెండ్ షిప్.. స్నేహ బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో నిజ జీవిత కథలు మనకు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహం అనేది ఎంతో విలువైనది. అలా స్నేహం కోసం విలువ ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరలకు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు.  తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. స్నేహానికి తాను ఇచ్చే విలువ ఏంటనది మరోసారి సాటి చెప్పారు. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ సీపీ తరపున నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిల్చుకున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించాలని బన్నీ కోరుకున్నారు.

2019లోని రవిచంద్రకు అల్లు అర్జున్ తన మద్దతను తెలిపాడు. తాజాగా మరోసారి 2024 ఎన్నికల్లో తన మిత్రుడి కోసం సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. బన్నీ దంపతులకు పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో బన్నీని చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ ‍క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్‌ తన మద్దతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు. ఎన్నికల వేళ బన్నీ ఇచ్చిన ట్విస్ట్ కి అందరు షాకయ్యారు. ఇదే సమయంలో వారి మధ్య స్నేహం ఎలా ప్రారంభమైంది అనే విషయంపై చాలా మందికి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అసలు విషయం ఏమింటే..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలానే వారిద్దరూ క్లాస్‌మెట్స్‌ కూడా. దీంతో వీరిద్దరి ద్వారా తరచూ బన్నీ, రవి కలుసుకునే వారు. అలా వారి స్నేహంతో  రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులు అయ్యారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల్లో జరిగే వేడుకలకు కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు. బన్నీ ఎప్పుడు రాజకీయ గురించి ఎంతో ఆసక్తిగా చర్చిస్తాడనే రవిచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తన ఫ్యామిలీ వాళ్లు రాజకీయాల్లో ఉండటంతో బన్నీని ప్రచారానికి, మద్దతు ఆహ్వానించాలని అనుకోలేదు. అయినా.. స్నేహం కోసం బన్నీ .. తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని రవిచంద్రారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Show comments