Arjun Suravaram
ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు .. పురంధేశ్వరిపై మండిపడ్డారు.
ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వంపై ఆమె చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు .. పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Arjun Suravaram
ప్రస్తుతం ఏపీ రాజకీయంలో మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి, వైసీపీ నేతల మధ్య పరస్పరం ఆరోణపలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుంచే పురందేశ్వరికి మద్దతు కొరవడటంతో ఆమెకు బీజేపీలో అంత సీన్ లేదనే సంకేతాలు వెలువడ్డాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పురందేశ్వరి ఏపీలో చేస్తున్న రాజకీయానికి సంబంధించిన సమాచారాన్ని వైసీపీకి బీజేపీ ఢిల్లీ పెద్దలే చేరవేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పురందేశ్వరిపై వైసీపీ విమర్శల తీవ్రతను రోజురోజుకూ పెంచుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు.. పురంధేశ్వరిని చంద్రముఖితో పోల్చారు.
గురువారం రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ..”పురందేశ్వరి, టీడీపీ , జనసేన నేతలపై మండిపడ్డారు. పురందేశ్వరి చంద్రముఖిగా మారారని విమర్శించారు. సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు పోయిన గౌరవం , పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు వచ్చిందని మంత్రి అప్పల రాజు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఆ గౌరవం పోవడంతో పాటు బీజేపీలో కూడా ఆమెకు మద్దతు లేదని ఆయన తెలిపారు. అంతేకాక సొంత పార్టీ లో కూడా ఆమెకు మద్దతు కొరవడిందని, అలాంటప్పుడు ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగడం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. టీడీపీలో చేరిపోతే సరిపోతుంది కదా అని పురందేశ్వరికి ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ఇదే సమయంలో పురందేశ్వరిపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రతిరోజూ పురందేశ్వరి మద్యం బ్రాండ్లను రుచి చూస్తున్నారేమో అని వ్యంగ్యంగా అన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలకు రేటు కట్టి టీడీపీకి పవన్‌కల్యాణ్ అమ్ముకున్నారని విమర్శించారు. ఇటీవల పురంధేశ్వరి.. సీఎం జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాశారు. దీంతో విజయ సాయి రెడ్డి, పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, మంత్రులు పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.