ఐదేళ్లలో పేదలే ధనవంతులు.. సజ్జల కీలక వ్యాఖ్యలు!

ఐదేళ్లలో పేదలే ధనవంతులు.. సజ్జల కీలక వ్యాఖ్యలు!

ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్ గా  ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. ఈ రాజకీయం మరింత హీటెక్కుతుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో టీడీపీ, జనసేనలు.. అధికార వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచక పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు సైతం కూడా ప్రతిపక్షాలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. తరచూ పవన్ కల్యాణ్, చంద్రబాబులపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచకపడుతుంటారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.

శనివారం గుంటూరు జిల్లా కృపాయపాలెంలోని జగనన్న లే అవుట్ ను సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడంతో రానున్న ఐదేళ్లలో పేదలు ధనవంతులు కావడం ఖాయమని, దీంతో ఎల్లో మీడియా ఛానల్ల అధినేతలు ఏడవడం, చంద్రబాబు కుళ్లికుళ్లి చావడం ఖాయమని ఆయన తెలిపారు.  రాజధానిలో పేదలకు ఉండకూడదని, సంపన్న వర్గాలు మాత్రమే  ఉండాలని చంద్రబాబు కోరుకున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదని సజ్జల చెప్పారు. రాజధాని ప్రాంతం జీవం లేకుండా ఉందని, సీఎం జగన్  ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని చూసినా చంద్రబాబు రైతుల ముసుగులో కోర్టులను ఆశ్రయించి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆరు నెలల్లో ఇక్కడ 25 ఊర్లు, 50 వేలకు  పైగా నివాసాలు , రెండు లక్షలకు పైగా జనాభా వస్తుందని ఆయన తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..”రాజధానిలో పేదలకు ఇళ్లు  ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. ఇది వారి స్వర్గమని, వారి సామాజిక వర్గ మాత్రమే ఉండాలని చంద్రబాబు,ఒక వర్గం మీడియా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు.కోట్ల రూపాయలు న్యాయవాదులకు ఫీజులు కట్టారు.  సీఎం జగన్ ఎప్పుడు పేదల పక్షాన పోరాటం చేసిన అన్ని  సౌకర్యాలతో అమరావతిలో ఇళ్లు నిర్మిస్తు్నారు. రాజధానిలో రైతులు లేరు.  చంద్రబాబు, ఆయన అనుచురులు భూములు  కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మరి..  సజ్జల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో ఫలితాన్నిస్తున్న ‘జగనన్న సురక్ష’!

Show comments