iDreamPost
android-app
ios-app

చంద్రబాబుని కలవడం Jr. NTR కి ఇష్టం లేదా? తేల్చి చెప్పినట్టేనా?

చంద్రబాబుని కలవడం Jr. NTR కి ఇష్టం లేదా? తేల్చి చెప్పినట్టేనా?

తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో నందమూరి కుటుంబానిది విశిష్టమైన స్థానం. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో జూనియర్ యన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నటనలో తాతకి తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్.. ఇప్పుడు పొలిటికల్ గా కూడా తాత ఆశయాల మేరకే ముందుకి పోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో టీడీపీకి సపోర్ట్ చేసిన జూనియర్ యన్టీఆర్ ని తరువాత కాలంలో చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. ఇదే సమయంలో లోకేష్ పొలిటికల్ కెరీర్ కోసం చాలానే కష్టపడ్డాడు.

ఎక్కడ జూనియర్ తన కొడుక్కి అడ్డం అవుతాడో అని.. చంద్రబాబు ఇలాంటి ఎత్తు వేశారని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. సీన్ కట్ చేస్తే.. అక్కడ నుండి జూనియర్ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక హరికృష్ణ మరో బిడ్డ.. కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో తమ్ముడినే ఫాలో అవుతూ వస్తున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు అప్పట్లో తమ సొంత అక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఈ అన్నదమ్ములు ప్రచారానికి పోలేదు. ఇక టీడీపీ గొప్పగా చెప్పుకునే మహానాడు వైపు అయితే.. వీరు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఆఖరికి యన్టీఆర్ శతజయంతి ఉత్సవానికి కూడా తారక్ అందుబాటులో లేకుండా పోయారు.

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని  కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి కూడా పెద్దాయన కుటుంబం మొత్తానికి ఆహ్వానం అందింది.  అలానే ఈ కార్యక్రమానికి యన్టీఆర్ వారసులు అందరూ హాజరయ్యారు. కానీ.., జూనియర్ మాత్రం ఈ కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఇలా.. చంద్రబాబు అధ్యక్షతనో, లేక ఆయన పెద్దరికం చాటుకునే ఈవెంట్స్ కు.. తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు. బాబుతో కలిసి వేదికను పంచుకోవడం ఇష్టం లేకనే జూనియర్ యన్టీఆర్ ఇలా అన్నీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న కొత్త టాక్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది.

మరోవైపు ‘దేవర’ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే తారక్.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అని బయటకి చెప్తున్నా.. నెటిజన్స్ మాత్రం అసలు విషయం వేరే అంటూ.. చంద్రబాబుపై తారక్ వ్యతిరేకంగా ఉన్నారన్న టాక్ వైరల్ చేస్తున్నారు. జూనియర్ యన్టీఆర్ మొన్నటికి మొన్న కూడా ఫ్యామిలీ వేడుకలో పాలు పంచుకున్నారు. అక్కడ తన తోబోట్టువులతో, బాబాయ్ బాలయ్యతో, తమ్ముడు మోక్షేజ్ఞతో కలివిడిగా ఉంటూ.. సరదాగా గడిపారు. కానీ.., చంద్రబాబుతో మాత్రం తారక్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు ఏవి బయటకి రాలేదు. పైగా.. తారక్ హాజరుకాని అన్నీ ఈవెంట్స్ లో బాబు కామన్ పాయింట్ గా ఉంటూ వస్తున్నారు. ఈ లాజిక్ ని పట్టుకునే కొంతమంది CBN vs NTR అనే ట్యాగ్ హైలెట్ చేస్తున్నారు.

కానీ.., ఈ విషయంలో మాత్రం తారక్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈలోపే.. సోషల్  మీడియాలో ఇలాంటి ఓ ట్రెండ్ స్టార్ట్ అవ్వడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జూనియర్ తమకి వ్యతిరేకంగా ఉన్నాడన్న టాక్ మాత్రం ప్రజలు నమ్మితే పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మరి.. రాజకీయ అవసరాల కోసం ఎలాంటి ఎత్తులు అయినా వేయడానికి ఆలోచించని బాబు.. ఇప్పుడు పెద్దాయన మనవడిని మళ్ళీ ప్రసన్నం చేసుకునే  పనిలో పడుతాడేమో చూడాలి. మరి.. బాబు హాజరవుతున్న వేడుకలకు, వేదికలకు తారక్ దూరంగా ఉంటూ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: NTR చావుకు కారణమైన వాళ్లే ఆయన ఫోటోకు దండం పెడుతున్నారు: CM జగన్