APలో ఘోర ప్రమాదం.. కాల్వలో పడినపెళ్లి బస్సు.. ఏడుగురు మృతి!

పెళ్లి.. అంటే వధువరుల  కుటుంబాల్లో ఎక్కడలేని సంతోషం, సందడి కనిపిస్తోంది. పెళ్లికి తమ బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తారు. అలానే పెళ్లి, రిసెప్షన్లకు వెళ్లేందుకు బస్సులను, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక అందులో  తెగ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తుంటారు. అలానే ప్రకాశం జిల్లా పొదిలి చెందిన ఓ పెళ్లి బృందం కాకినాడ బయలుదేరింది. కానీ అర్ధ రాత్రి  దాటిన తరువాత ఘోరం జరిగింది. పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రకాశం జిల్లా పొదిలి నుంచి  వివాహ రిసెప్షెన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. సోమవారం సాయంత్రం బస్సు పొదిలి నుంచి కాకినాడకు బయలు దేరింది. పెళ్లి బృందం ఎంతో సందడిగా,హాయిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా సాగుతున్న వారి జర్నిలో అర్ధరాత్రి దాటిన తరువాత విషాదం చోటు చేసుకుంది.  దర్శి సమీపంలోని సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం వెళ్తున్న బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హాని (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)గా గుర్తించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా రాత్రివేళ ప్రయాణాల్లో  చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్ర మత్తు, రోడ్లపై స్ట్రీట్ లైట్లు సరిగ్గా వెలగక పోవడం, క్రాసింగ్ లైన్స్.. ఇలా ఎన్నో రకాల కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిపోతున్నాయి. ఈ ఘోర విషాదంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments