Arjun Suravaram
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అతివేగం, నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా సాగిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు ఇళ్లలో నిద్రిస్తున్న కూడా వాహన రూపంలో మృత్యువు దూసుకొస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా పెదవేగి మండలం చక్రాయగూడెంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. అనంతరం అదుపు తప్పిన ఆ లారీ పక్కనే ఉన్నఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటిని ఢీ కొట్టిన తరువాత అక్కడే పార్కింగ్ లో ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ లోని కట్టెలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా చాలా సమయం పాటు ట్రాఫిక్ ఏర్పడింది. స్థానికులు సమచారం అందించడంతో పోలీసులు అక్కడి చేరుకుని ప్రమాదా తీరును పరిశీలించారు. అయితే తమ ఇంటికిపై లారీ దూసుకు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇలాంటికి ఘటనలు జరిగి పలువు ప్రాణాలు కోల్పోయారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.