Arjun Suravaram
Statue Of Social Justice: దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా ఆయన భారీ విగ్రహాన్ని ఏపీలోని విజయవాడలో ఆవిష్కరించారు.
Statue Of Social Justice: దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాజాగా ఆయన భారీ విగ్రహాన్ని ఏపీలోని విజయవాడలో ఆవిష్కరించారు.
Arjun Suravaram
భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి.ఆర్. అంబేడ్కర్ కు ఏపీ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది.మతాతీతమైన విగ్రహాల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైనది ఈ మహనీయుడి విగ్రహం రూపొందింది. 206 అడుగుల ఎత్తుతో అంబేడ్కర్ విగ్రహం నిర్మించబడింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఈ విగ్రహం ఏర్పాటు చేయబడింది. శుక్రవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పిలుస్తున్నారు. మరి.. ఆ పేరే పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
కొన్ని దశాబ్దాల క్రితం దళితులు, బడుగు, బలహీన వర్గాల వారు తీవ్ర అణచివేతకు గురయ్యారు. గుడి, బడి, ఇతర ప్రదేశాల్లో ఎక్కడ వారికి సమాన న్యాయం ఉండేది. ఇంకా దారుణం ఏమిటంటే.. గ్రామాలకు దూరంగా ఉండే వారు. తమ బతుకు ఇంతే అని ఆ తరం దళితులు, బడుగు,బలహీన వర్గాల వారు వేదన చెందుతున్న వేళ.. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు వచ్చారు ఓ మహనీయుడు. కేవలం కొందరికే పరిమితం కాకుండా అందరికీ సమన్యాయం చేయాలని భావించి.. ఆ దిశగా ముందుకు సాగారు ఆ గొప్ప వ్యక్తి.
ఇక పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేలే సామాజిక న్యాయానికి నడుంబిగించారు ఆ యోధుడు. ఇన్ని పేర్లతో మనం కీర్తించిన ఆ ధృవతార ఎవరో కాదు.. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. భారత రాజ్యాంగ రూప శిల్పి అయినా ఈయన.. అణగారిన వర్గాల పాలిట దేవుడిగా మారారు. అంబేద్కర్ గారు ఓ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా మనకు పరిచయం చేయక్కర్లేని పేరు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు భారత చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్న విషయం మనకు తెలిసిందే.
దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేడ్కర్. కుల, మత రహిత నవ భారత నిర్మాణం కోసం అంబేడ్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు ఆయన చేసిన పోరాటం మరువలేనిది. నాటికాలంలో సమాజంలో అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది. తాను చిన్ననాటి నుంచే ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి.
ఇక తరతరాలుగా బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. సమాజంలో అందరికి సమ న్యాయం ఉండాలని బలంగా నమ్మి ఆ దిశ గా కృషి చేసిన గొప్ప నాయకుడు బి.ఆర్. అంబేడ్కర్. అలా ఆయన జీవితాంతం సమాజంలో అందరికి సమ న్యాయం ఉండాలని భావించారు. అందుకే తాజాగా విజయవాడంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం చేశారు. మరి.. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.