P Venkatesh
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మీరు ఈ మధ్య రైలు ప్రయాణం చేయలనుకుంటున్నారా? ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఏయే రైళ్లు రద్దయ్యాయంటే?
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మీరు ఈ మధ్య రైలు ప్రయాణం చేయలనుకుంటున్నారా? ఆగస్టు 11 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. ఏయే రైళ్లు రద్దయ్యాయంటే?
P Venkatesh
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన రైలు ప్రయాణానికి ఆదరణ ఎక్కువ. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా కావడంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. నిత్యం లక్షలాది మంది ట్రైన్ జర్నీ చేస్తున్నారు. మరి మీరు ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి తెలిపారు. ఏయే రైళ్లు రద్దయ్యాయంటే?
రైలు ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆగస్టు 11వరకు రైళ్లు రద్దయ్యాయి. రద్దుకాబడిన ట్రైన్లలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసులకు వెళ్లే వారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ప్రయాణం కష్టంగా మారనుంది. కాగా ఈనెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్రవరం-విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమహేంద్రవరం (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి (22707) డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది.