సోమవారం విద్యా సంస్థలకు సెలవు

ఒక వైపు చలి చంపేస్తుంటే.. మరో వైపు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తుంది. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఆదివారం నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఏపీలో పలు జిల్లాల్లో వానలు కురవనున్నాయి.

ఒక వైపు చలి చంపేస్తుంటే.. మరో వైపు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తుంది. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఆదివారం నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఏపీలో పలు జిల్లాల్లో వానలు కురవనున్నాయి.

శీతాకాలం మొదలై దాదాపు నెల గడుస్తోంది. నవంబర్ మధ్యలో నుండి విపరీతంగా చలి వణికిస్తోంది. మంచు దుప్పటి మెల్లగా పరుచుకుంటోంది. ఉదయం 9 అవుతున్నా భానుడు కనపడటం లేదు. సాయంత్రం 4 గంటలకు సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్లిపోతున్నాడు. అప్పటి నుండే చల్లటి గాలులు చంపేస్తున్నాయి. దుప్పట్లు, రగ్గులు, స్వెటర్స్ వేసుకున్నా చలితో వణికిపోతున్నారు ప్రజలు. ఈ క్రమంలో మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. అప్పుడప్పుడు తెలంగాణలో వానలు పలకరిస్తున్నాయి. ఇప్పుడు ఏపీకి తుఫాన్ ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. దీంతో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని అంచనా వేస్తుంది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఆదివారం నాటికి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు చెబుతోంది. దీనికి మిచాంగ్ తుఫాన్ అని నామకరణం చేశారు. ఇది నెల్లూరు జిల్లా వైపు వేగంగా దూసుకు వస్తోంది. ఐఎండీ చేసిన హెచ్చరికలతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే జాలర్లను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాన్ దక్షిణ కోస్తా తీరానికి సమాంతరగా పయనించి.. మంగళవారం కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నం తీరం దాటే అవకాశముంది.

Show comments