iDreamPost
android-app
ios-app

మరో 4 రోజులు వర్షాలు! ప్రయాణాలు చేసే వారికి బిగ్ అలెర్ట్!

వీకెండ్ వచ్చిందని, ఏదో పని ఉందని ఆంధ్రప్రదేశ్ వెళదామని బయలు దేరుతున్నారా..? అయితే బీ అలర్ట్. రెండు రోజులుగా ఏపీని వానలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అలాగే హైవేలపై కూడా

వీకెండ్ వచ్చిందని, ఏదో పని ఉందని ఆంధ్రప్రదేశ్ వెళదామని బయలు దేరుతున్నారా..? అయితే బీ అలర్ట్. రెండు రోజులుగా ఏపీని వానలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అలాగే హైవేలపై కూడా

మరో 4 రోజులు వర్షాలు! ప్రయాణాలు చేసే వారికి బిగ్ అలెర్ట్!

వీకెండ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్‌కు వెళదామని బయలు దేరుతున్నారా… అయితే ఈ వార్త మీకోసమే. రెండు రోజులుగా ఏపీని వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కుండకు చిల్లులు పడ్డట్లు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతుకు పైగా వాన నీరు రహదారులపై పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కేవలం నగరంలోని రోడ్లపైనే కాదు జాతీయ రహదారులపై కూడా వాన నీరు చేరి నదిని తలపిస్తోంది.

ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయకపోవడమే మేలు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అయ్యారు.  భారీగా వాన నీరు రహదారులపై పొంగిపొర్లుతోంది. గుంటూరు- విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాన నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ఫ్లాజా వద్ద భారీగా వరద నదిలా ప్రవహిస్తోంది. హైవేపై మూడగుల మేర వాన నీరు నిలిచిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. అక్కడ సర్వర్ ఇష్యూ కూడా తలెత్తడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ దాటాలంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.

రంగంలోకి దిగిన పోలీసులు..  కాజా టోల్ ఫ్లాజా మీదగా వెళ్లే వాహనాలను పంపించేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. వరద నీరు జాతీయ రహదారిపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురౌతున్నారు. వరద నీరు ఒక వైపు.. టోల్ ఫ్లాజా వద్ద సర్వర్ ఇష్యూ మరో వైపు ఉండటంతో అసహనానికి గురౌతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటుగా రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే..ఇటు వైపుగా రావొద్దు అని చెబుతున్నారు. ఒక్క కాజా వద్ద మాత్రమే కాదు.. ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య తలెత్తుతుంది. మరో వైపు కూడా మూడు, నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ చెబుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ వెళ్లాలని భావించే వారు.. ఆ ప్రయత్నాలు మానుకోవడం మంచిది.