బాయ్స్ హాస్టల్‌లో కొండచిలువ.. ఎంతైనా అబ్బాయిలు తోపు!

అడవుల నరికివేతతో వన్య ప్రాణులు జన సంచారం ఉన్న చోటికి వస్తున్నాయి. పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు పలుమార్లు జనావాసాల్లోకి వచ్చి దాడి చేస్తున్న ఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే. పాములు,కొండ చిలువలు వంటి సరీసృపాల సంగతి చెప్పనక్కర్లేదు..

అడవుల నరికివేతతో వన్య ప్రాణులు జన సంచారం ఉన్న చోటికి వస్తున్నాయి. పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు పలుమార్లు జనావాసాల్లోకి వచ్చి దాడి చేస్తున్న ఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే. పాములు,కొండ చిలువలు వంటి సరీసృపాల సంగతి చెప్పనక్కర్లేదు..

నానాటికి వృక్ష సంపద తగ్గిపోతుండటంతో ఎక్కడ బతకకాలో తెలియక.. జన ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి వన్య ప్రాణులు. దీంతో భయాందోళనకు గురౌతున్నారు ప్రజలు. ఎలుగు బంట్లు, పులులు వంటివి పొలాల్లో, చెరువుల వద్ద కాపుకాసి.. మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే సరీసృపాలు కూడా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాము కాటు కారణంగా పలువురు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కొండ చిలువ ఏకంగా కాలేజీలోకి చొరబడి.. కామ్‌గా కూర్చుంది. దీన్ని చూసిన స్టూడెంట్స్ కొంచెం షాక్ కు గురైన.. వెంటనే తేరుకుని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు వచ్చి..బంధించి తీసుకెళ్లారు.

కడప జిల్లా ఇడుపుల పాయలో కొండ చిలువ కంగారు పెట్టింది. ట్రిపుల్ ఐటీ కాలేజీకి చెందిన బాయ్స్ హాస్టల్-2లోని ఓ రూములోకి వచ్చిన పాము.. ఓ మంచం కింద నక్కింది. హాస్టల్ రూంకు వచ్చిన విద్యార్థులు భారీగా ఉన్న కొండ చిలువను చూసి కాస్త కంగారు పడినప్పటికీ.. వెంటనే యాజమాన్యానికి తెలియజేశారు. కాలేజీ యాజమాన్యం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వేంపల్లి అటవీ శాఖ అధికారులు హాస్టల్ వద్దకు చేరుకుని కొండ చిలువను గోనె సంచిలో బంధించి.. తీసుకెళ్లి.. సురక్షితంగా అటవీలో వదిలిపెట్టారు. సాధారణంగా చిన్న పాము కనబడితేనే పాం, పాం పాం అంటూ అరుస్తూ ఉంటారు. కానీ ఈ కాలేజీ అబ్బాయిలు భయపడలేదు.. సరికదా.. యాజమాన్యానికి తెలపడంతో.. ఆ అబ్బాయిలా తోపహే అని తోటి విద్యార్థులు కొనియాడుతున్నారు.

ఇలాంటి సరీసృపాలు జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి  రావడం కొత్త కాదు. గతంలో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి. బైక్,షూస్, చివరకు హెల్మెట్, బైక్ సీటు కింద కూడా నక్కి దాక్కున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విషపూరిత పాములు కాటేస్తే  నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోతుంటాయి. కొండ చిలువ లాంటి భారీ సరీసృపాలు అయితే.. అమాంతం మనిషిని చుట్టేయగలవు. చిన్న చిన్న జంతువులను చంపి, మింగేస్తుంటాయి.. ఇలాంటి భారీ కొండ చిలువలు.

Show comments