Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పలు సర్వేలు తమ రిపోర్టులను వెల్లడిస్తున్నాయి. తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ప్రీ పోల్ సర్వే రిపోర్టు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పలు సర్వేలు తమ రిపోర్టులను వెల్లడిస్తున్నాయి. తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సర్వే సంస్థ తాజాగా ప్రీ పోల్ సర్వే రిపోర్టు వెల్లడించింది.
Arjun Suravaram
ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మాములుగా లేదు. సమ్మర్ హీట్ కు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడి రాజకీయ రణరంగం సాగుతోంది. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష కూటమి టీడీపీ, బీజేపీ, జనసేలు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఇది ఇలా ఉంటే ఎన్నికల పోలింగ్ తేది దగ్గర పడుతున్న సర్వేల హడావుడి మొదలైంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని తెలియజేశాయి. రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ అదే అంటూ తన సర్వేలు తేల్చేసింది సదరు సంస్థ. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఏపీలో పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తూ తమ అభిప్రాయాలను చెబుతున్నాయి. అభ్యర్థుల జాబితా, ప్రచార కార్యక్రమాలు, పార్టీలకు లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల పలు పరిణామాలను కూడా సర్వే సంస్థలు తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.
ఇప్పటికే దాదాపు అన్ని సర్వే సంస్థలు ఏపీలో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే తమ అభిప్రాయాలను తెలియజేశాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలోని పలు సర్వేలు సైతం ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసేందే. మేమంతా సిద్ధం పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్ర శనివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
ఇలా సీఎం జగన్ పై దాడి జరిగిన ఇలాంటి సమయంలో తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సంస్థ ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఈ సంస్థ 2024 మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించింది. 1,48,532 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. ఇక పోల్ స్ట్రాటజీ రిపోర్ట్ ప్రకారం చూస్తే- ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. అలానే లోక్‌సభలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. 19 నుంచి 21 లోక్‌సభ స్థానాలను వైసీపీ గెల్చుకుంటుందని ఈ సర్వే సంస్థ తేల్చింది.
ఇక కూటమి కి మరోసారి పరాభవం తప్పకపోవచ్చని పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రీ పోల్ సర్వే అంచాన వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45 నుంచి 55 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయని తేల్చి చెప్పింది. అలానే లోక్‌సభలో కూడా కూటమికి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. ఇక ఓటింగ్ శాతం చూసినట్లు అయితే వైసీపీ 50 నుంచి 52 శాతం వరకు ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసింది. 48 శాతం మంది పురుషులు, 55 శాతం మంది మహిళలు సీఎం జగన్ వైపే మొగ్గు చూపుతున్నారని ఈ సంస్థ అంచాన వేసింది. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 44 నుంచి 46 వరకు ఉంటుంది. ఇతరులకు పడే ఓట్ల శాతం 0.5 శాతం మాత్రమే. సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈ సర్వేకి ఏపీలో ప్రాముఖ్యత సంతరించుకుంది.