iDreamPost
android-app
ios-app

లోకేశ్ కు గుడివాడలో పోటీ చేసే దమ్ముఉందా?: పేర్ని నాని

లోకేశ్ కు గుడివాడలో పోటీ చేసే దమ్ముఉందా?: పేర్ని నాని

మాజీ మంత్రి, మంచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. నారా లోకేశ్ ,చంద్రబాబులకు తనదైన స్టైల్ లో  కౌంటర్లు ఇస్తుంటారు. చంద్రబాబు, నారా లోకేశ్ లు సీఎం జగన్ పై ఆరోపణలు చేసిన ప్రతిసారి పేర్ని నాని.. వారిపై విరుచకపడుతుంటారు. అలానే మంగళవారం గన్నవరంలో యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ భారీ బహిరంగ సభలో ప్రసగిస్తూ సీఎం జగన్ పై అనేక అసత్య ఆరోపణలు చేశాడు. అయితే ఆ మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్ కు దమ్ము ఉంటే గుడివాలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర సూర్యుడు అస్తమించాక ప్రారంభమవుతుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం ఛీ కొడతారని, జనం నిద్రపోయాక అర్ధరాత్రి చేస్తున్నారని  అన్నారు. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు  ఇచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారని నాని మండిపడ్డారు. లోకేశ్ ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి..చంద్రబాబు జనం మీదకి వదిలాడు. ప్రజలు సమస్య తెలుసుకోవడం కంటే.. జగన్ ని బూతులు తిట్టటానికే లోకేశ్ యాత్ర చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.  పాదయాత్ర అంటే ఎలా ఉండాలో వైఎస్సార్, జగన్ పాదయాత్ర వీడియోలు చూస్తే  తెలుస్తుందని, తండ్రి గురించి చెప్పుకోలేని దుస్థితిలో లోకేశ్ ఉన్నాడని ఆయన  అన్నారు.

 ఇంకా ఆయన మాట్లాడుతూ..”జగన్ ..పేదలకు ఇళ్లు కట్టిస్తాని, ఉద్యోగాలు కల్పిస్తాననీ, విద్యారంగంలో సమూల మార్పులు తెస్తాననీ చెప్పుకుని ఓట్లు అడిగారు. కానీ లోకేశ్ మాత్రం బూతులతో పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా వంశీ పశువులు డాక్టర్. అలానే 2004,2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని సాఫ్ట్ వేర్  ఇంజినీరా?.ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు కడిగేవాడా?. వారిద్దరిని చూస్తే తండ్రీకొడుకులకు ప్యాంట్లు తడుస్తున్నాయి. కొడాలి నాని  చంద్రయాన్ సైంటిస్తునని ఎప్పుడు చెప్పుకోలేదే?” అని చంద్రబాబు, నారా లోకేశ్ లపై పేర్ని నాని మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” పండగ సమయంలో హరిటెజ్ సరుకులను అమ్ముకోవడానికి రకరకాల పేర్లతో పథకాలను పెట్టారు. అన్నా క్యాంటీన్ల పేరుతో దోపిడీ చేశారు. బెజవాడకు అటు గన్నవరంలో వంశీ గెలిస్తే. ఇటు వైపు మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాడు. అలాంటి లోకేశ్ కూడా వంశీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా తప్పుడు సంస్కారం, బూతులు తిట్టడం మానుకోవాలి” అని పేర్ని నాని హితవు పలికారు. మరి.. పేర్ని నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చంద్రబాబు బీసీలను యంత్రంలా వాడుకున్నాడు: కారుమూరి

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet