iDreamPost

చంద్రబాబు బీసీలను యంత్రంలా వాడుకున్నాడు: కారుమూరి

చంద్రబాబు బీసీలను యంత్రంలా వాడుకున్నాడు: కారుమూరి

ఏపీలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. దేశంలోని ఎక్కడా లేని పొలిటికల్ హీట్ ఏపీలో కనిపిస్తోంది. ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం  ఓ రేంజ్ లో సాగుతుంది. ప్రతిపక్ష టీడీపీ  అధినేత, ఇతర నేతలు సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శుల గుప్పిస్తున్నారు. వారికి ధీటుగానే చంద్రబాబు, లోకేశ్ లపై వైసీపీ మంత్రులు, ఇతర నేతలు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు కట్టే రాఖీతో బైపీసీ చదివి ఇంజినీర కావచ్చంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. అయితే తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు కూడా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే బీసీలకు మేలు జరిగిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై మండిపడ్డారు. నారా లోకేశ్ ఓ పిల్ల కాకి అంటూ దుయ్యబట్టారు. అతను ఓనమాలు తెలియని వ్యక్తని, తొలుత లోకేశ్ అక్షరాలు నేర్చుకుంటే మంచిదని అన్నారు. బీసీల నుంచి ఆర్. కృష్ణయ్యను, బీదా మస్తాన్ రావును, అలానే మత్స్యకారుల నుంచి మోపిదేవి వెంకట రమణను, శెట్టి బలిజకు సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్ దని మంత్రి అన్నారు.

అసలు చంద్రబాబు, లోకేశ్ లకు సిగ్గు శరం ఉందా? అని అడుగుతున్నానని మంత్రి ఫైర్ అయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించాడా అని మంత్రి ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేశ్ కు లేదని, బీసీలను ఓట్లేసే యంత్రంలా చంద్రబాబు వాడుకున్నాడని ఆయన  అన్నారు. ఇష్టానుసారంగా దొంగ ఓట్లు రాయించింది చంద్రబాబేని, అల్జీమర్స్‌ వ్యాధి చంద్రబాబు కుటుంబంలో ఉందని మంత్రి కారుమూరి మండిపడ్డారు.

ఇదీ చదవండి: నన్ను చంపేందుకు లోకేశ్ కుట్ర చేస్తున్నారు: పోసాని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి